రామ్ చరణ్ కాదన్న పాత్రలో నాగచైతన్య
రామ్ చరణ్, మహేష్ బాబు,రానా చేయనన్న స్క్రిప్టులో ఒదగటానకి నాగచైతన్య రెడీ అవుతన్నాడు. ప్రస్దానం దర్శకుడు దేవకట్టా రూపొందించనున్న ఆటో నగర్ సూర్య చిత్రాన్ని మొదట వీరికి నేరేట్ చేస్తే చేయనని అన్నారు. రానా అయితే చాలా మార్పులు చెప్పాడని తెలుస్తోంది. అయితే పట్టువదలని విక్రమార్కుడులా దేవకట్టా ముందుకు వెళ్ళి ఈ ప్రాజెక్టుని ఓకే చేయించుకన్నారు. ఇక ఈ చిత్రంలో అతని సరసన రాకుల్ ప్రీతీ సింగ్ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో జరిగుతుందని ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం వచ్చే నెల నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











