ఆ సినిమాకోసం నాగచైతన్య సిక్స్ ప్యాక్
రీసెంట్ గా తమిళ వెట్టై చిత్రం రీమేక్ తడాఖాతో హిట్ కొట్టిన నాగచైతన్య... తన తదపరిచిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు ..కన్నడ చిత్రం ఛార్మినార్ రీమేక్.
నాగచైతన్య వరసగా రీమేక్స్ చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడెక్కడ రీమేక్ లు అతని వద్దకు వచ్చి వాలుతున్నాయి. కన్నడంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఛార్మినార్ చిత్రం రీమేక్ కోసం అతన్ని సంప్రదించినట్లు సమాచారం. ఛార్మినార్ చిత్రం చూసి నాగచైతన్యకు నచ్చినట్లైతే లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నారు. కన్నడంలో డైరక్ట్ చేసిన దర్శకుడే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
మరో ప్రక్క నాగచైతన్య తాజాగా హలో బ్రదర్ రీమేక్ చేస్తున్నారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంగా ఉన్నాడు.
" రీమేక్ చిత్రం చేస్తున్నంత మాత్రం ఉన్నదున్నట్లు సీన్ టు సీన్ రీమేక్ చేయం. స్క్రిప్టులో చాలా మార్పులు చేస్తున్నాం. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ గా గ్లామర్ గా ఉంటుంది ," అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య.


Click it and Unblock the Notifications












