twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరు క్రేజీ ప్రాజెక్టులతో నాగ చైతన్య.. ఒక్కో ప్రాజెక్టుకు భారీగా, దిమ్మతిరిగే రెమ్యునరేషన్

    |

    అక్కినేని నట వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి అడుగులోనే నాగ చైతన్య భారీ స్థాయిలో డిజాస్టర్ అందుకున్నాడు. అయితే అలాంటి ఫెయిల్యూర్ నుంచి చాలా తొందరగానే కొలుకున్నాడు ఈ యువ హీరో. మెల్లమల్లగా బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం చైతన్య లైనప్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మొత్తం ఆరు సినిమాలు ఉండగా భారీ స్థాయిలో తన ఆదాయాన్ని పెంచుకోబోతున్నాడు.

    మజిలీ సినిమా నుంచి

    మజిలీ సినిమా నుంచి

    నాగ చైతన్య కెరీర్ చాలా డిఫరెంట్ గా కొనసాగుతోంది. ఒక వైపు యూత్ కు కనెక్ట్ అవుతున్నాడు. మరోవైపు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరవుతున్నాడు. లైఫ్ పాట్నర్ జెస్సి వచ్చిన తరువాత లైఫ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా మజిలీ సినిమా నుంచి చైతన్య మార్కెట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

    బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    శైలజా రెడ్డి అల్లుడు లాంటి సినిమాకు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఆ సినిమా యవరేజ్ టాక్ తోనే పెట్టిన పెట్టుబడిని ఈజీగా వెనక్కి తెచ్చాడు. ఇక వెంకీ మామ అనంతరం లవ్ స్టోరీని గత ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి కరోనా దెబ్బతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని చెప్పవచ్చు.

     లైనప్ లో 6 సినిమాలు

    లైనప్ లో 6 సినిమాలు

    ఇక రానున్న రోజుల్లో నాగ చైతన్య నుంచి మరిన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం లైనప్ లో 6 సినిమాలు ఉన్నాయి. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

    బాలీవుడ్ ఎంట్రీ..

    బాలీవుడ్ ఎంట్రీ..

    ఇక మొదటిసారి బాలీవుడ్ లో కూడా నటించడానికి ఈ స్టార్ హీరో రెడీ అవుతున్నట్లు టాక్. అమీర్ ఖాన్ న్యూ ప్రాజెక్ట్ లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతన్య ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

    టాలెంటెడ్ దర్శకులతో

    టాలెంటెడ్ దర్శకులతో

    వెంకటేష్ తో సినిమా చేయాల్సిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు నాగ చైతన్య కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఆ సినిమాను నిర్మించనున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ లో పరశురామ్ తో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. అలాగే రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా సినిమా చేయబోతున్నాడు.

    Recommended Video

    Pitta Kathalu Team Interview With Ramya Krishna
    సినిమాల ద్వారా చైతన్య ఆదాయం

    సినిమాల ద్వారా చైతన్య ఆదాయం

    ఈ విధంగా ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన నాగ చైతన్య వచ్చే రెండేళ్ల వరకు బిజీగా గడపనున్నాడు. అయితే ఈ సినిమాల ద్వారా నాగ చైతన్య భారీ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకుంటున్నాట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక సినిమాకు 8కోట్లకు అటు ఇటుగా తీసుకున్నట్లు సమాచారం. అంటే 6 సినిమాల ద్వారా చైతన్య ఆదాయం దాదాపు 50కోట్లకు దగ్గరలో ఉంది. పైగా మధ్యమధ్యలో కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు కాబట్టి ఈ లెక్కలు మరింత పెరగవచ్చు.

    English summary
    Young director Tarun Bhaskar, who has set a trend in the Tollywood industry with his bridal looks, has also received good craze with his second film. What happened to this city was that the movie not only made good profits at the box office but it is still a favorite movie for the youth. Memes related to the movie continue to go viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X