ఒక్కసారిగా మారిన నిఖిల్ 'స్పై' గెస్ట్.. చిరంజీవి స్థానంలో యంగ్ హీరో.. వేడుక రోజే ఇలా!
విభిన్నమైన స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవల కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ యంగ్ హీరో. ఇక కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ఎంతగా పాపులర్ అయ్యాడో తెలిసిందే. దీంతో అతనితో పాన్ ఇండియా చిత్రాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నిఖిల్ త్వరలో స్పైగా అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన వేదికకు ముఖ్య అతిథి మారినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి స్థానంలో ఓ యంగ్ హీరో రావడం హాట్ టాపిక్ గా అవుతోంది.
టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టాడు. కార్తికేయ 2, 18 పేజీస్ చిత్రాల సక్సెస్ తో నిఖిల్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. దీంతో అతనికి వరుస భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ లోని తొలి సినిమాకు నిఖిల్ హీరో అని తెలిసిందే. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లలో నిఖిల్ 'ది ఇండియా హౌజ్' (The India House) సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక త్వరలోనే స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవల విడుదలైన స్పై టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న రహస్యం, ఆయన జీవితానికి సంబంధించిన పలు సన్నివేశాలతో ఆసక్తికర థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది స్పై. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి. హెచ్ దర్శకుడిగా మారారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 29న స్పై సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా స్పై ప్రీ రిలీజ్ వేడుకను జూన్ 27 అంటే ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనుకోకుండా గెస్ట్ మారారు. చిరంజీవి స్థానంలో చీఫ్ గెస్ట్ గా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యను తీసుకురానున్నారట స్పై మేకర్స్. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున గెస్ట్ ఒక్కసారి మారడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.


Click it and Unblock the Notifications











