సమంత కోసం నాగ చైతన్య తాపత్రయం.. డైరెక్టర్ వద్ద రిక్వెస్ట్
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీ అక్కినేని నాగ చైతన్య, సమంత ఒకరంటే ఒకరు ఎంతలా ఇష్టపడతారో తెలిసిందే. ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటూ అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది ఈ జంట. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరుతెచ్చుకున్న ఈ జంట.. ఇటీవలే మజిలీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జోడీ కట్టి రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లోనూ తమను మించిన జోడీ లేదని చాటి చెప్పారు.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సమంత కోరిక తీర్చాలని నాగ చైతన్య డైరెక్టర్ శేఖర్ కమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నారట. శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయాలనే కోరిక ఇన్నాళ్లకు తీరుతోందని వీరిద్దరి సినిమా ప్రారంభమైన రోజు ప్రకటించారు నాగ చైతన్య. అయితే చైతూ భార్య సమంత కోరిక కూడా అదేనట. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఒక్క సీన్ అయినా చేయాలని ఆమె భావిస్తోందట. దీంతో తమ సినిమాలోనే సమంత చేత ఓ ఇంపార్టెంట్ రోల్ చేయించాలని చైతూ డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు తన అభ్యర్థనను శేఖర్ కమ్ముల వద్దకు తీసుకెళ్లాడని తెలుస్తోంది.

అయితే శేఖర్ కమ్ముల ఈ విషయమై ఎలా స్పందించారనేది మాత్రం తెలియరాలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో సాయిపల్లవిని హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేశారు. మరో రోల్ అంటే శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ కొద్దిగా మార్పు చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి నాగ చైతన్య తాపత్రయాన్ని శేఖర్ కమ్ముల ఏ మేరకు కన్సిడర్ చేస్తాడో! ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రాన్ని ఆగస్టు 1 నుంచి రెగ్యులర్ షూట్ చేయనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











