వర్మ 'బెజవాడ రౌడీలు' చిత్రంలో ఆ యంగ్ స్టార్ హీరో !?

By Srikanya

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించదలుచుకున్న బెజవాడ రౌడీలు చిత్రంలో నాగచైతన్యను హీరోగా ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జునతో చర్చించారని,శివ రేంజిలో ఈ చిత్రాన్ని మలచాలని వర్మ భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెళ్ళడించి సంచలనం రేపనున్నారని చెప్తున్నారు. ఇక తన చిత్రం విజయవాడ..రౌడీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుందని ఆయన అంటున్నారు. ఈ విషయమై ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో...నాకు విజయవాడతో విడతీయలేని అనుభందం ఉంది. అక్కడ రౌడీయిజాన్ని, వారి మధ్య జరిగే గొడవ లను నేను కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా దగ్గరగా గమనించేవాడ్ని. అలాగని ఈ చిత్రాన్ని శివతో పోల్చటానికి వీలు లేదు. ఇక్కడ హైదరాబాద్ రౌడీలు...విజయవాడ రౌడీయిజంలా ఆర్గనైజడ్ క్రేమ్ మెంటాలిటీ కాదు. నేను ముంబాయి మాఫియాని, రాయలసీమ ప్యాక్షనిజాన్ని వెండితెరపై చూపాక, విజయవాడ ముఠా కక్షలు గురించి తీస్తున్నాను. ఈ చిత్రం స్క్రిప్టు ఫైనల్ స్టేజస్ లలో ఉంది అన్నారు.ఇక నాగచైతన్యను ఈ చిత్రంలో ఎనౌన్స్ చేస్తే మరో శివ అవుతుందని అంతా ఎక్సపెక్ట్ చేసే అవకాశం ఉంటుందని బావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X