నాగచైతన్య, సుకుమార్ చిత్రం టైటిల్ అదేనా?

By Srikanya

నాగచైతన్య, సుకుమార్‌ కాంబినేషన్ లో ఆ మధ్య ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్‌ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు. అయితే సుకుమార్...ఈ చిత్రం కోసం 'దటీజ్‌ మహాలక్ష్మి.." అనే టైటిల్ ‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ టైటిల్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఉందని నాగచైతన్య నసుగుతున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం హైదరాబాద్‌ లో రెండు పాటలను, కొంత టాకీని చిత్రీకరించారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. నేటితరం యువతకు ప్రతినిథిలా నిలిచేలా నాగచైతన్య పాత్ర ఉంటుందని దర్శకుడు సుకుమార్‌ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ ‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఆర్య 2, జగడం చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో సుకుమార్ ఈ సినిమాని ఎలాగయినా సంచలన విజయం సాధించేలా హిట్ కొట్టాలని చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఆయన కోరిక నెరవేరాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X