నాగ చైతన్య,గౌతమ్ మీనన్ చిత్రం టైటిల్ ఇదే
హైదరాబాద్ : నాగ చైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వెంటాడు' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు టైటిల్ రిజిస్టర్ చేసినట్లు చెప్తున్నారు. రీసెంట్ గా చైతూ చేసిన దోచేయ్ చిత్రం ఫ్లాఫ్ కావటంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నాగచైతన్య కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఏమాయ చేసావే' కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావటంతో బిజినెస్ సైతం బాగా జరుగుతందని భావిస్తున్నారు. దాదాపు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మలయాళ భామ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన చేస్తోంది. ప్రస్తుతం బెంగుళూరులో షూటింగ్ జరుగుతోంది. అక్కడ నాగ చైతన్య, మంజిమ మోహన్, మిగిలిన ప్రముఖ నటీనటులపైన కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ప్రధానంగా నాగ చైతన్య, మంజిమ మోహన్ పై వచ్చే కొన్ని కీలకమైన లవ్ సీన్స్ ని బెంగుళూరు లో షూట్ చేస్తున్నారు.
ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళ వెర్షన్ లో కూడా మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











