నాగ చైతన్య కు ఈ టైటిల్ సెట్ అవుతుందా

By Srikanya

హైదరాబాద్ : నాగ చైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా' సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ జరుగుతోంది. దాదాపు షూటింగ్ ఫైనల్ స్టేజీకి చేరుకున్న ఈ సినిమా టైటిల్ విషయంలో త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆ టీమ్ కు ఓ టైటిల్ నచ్చిందని, అయితే ఆ టైటిల్ వేరే వారు రిజిస్టర్ చేయటంలో ఆలోచనలో పడ్డారని సమాచారం. ఆ టైటిల్ మరోదో కాదు... ‘హరిలో రంగ హరి'. మరి నాగ చైతన్యకు ఈ టైటిల్ ఎంతవరకూ సెట్ అవుతుందో అది కూడా చూడాలి.

నాగ చైతన్య సరసన హీరోయిన్ కోసం ‘1-నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటినుంచీ ఈ సినిమాకి ‘మాయగాడు' , దొరకడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దర్శక,నిర్మాతలు ఖండిస్తూ వచ్చారు. ‘హరిలో రంగ హరి' టైటిల్ దొరకకపోతే ఈ టైటిల్స్ తో ఏదో ఒక దానితో ముందుకెళ్లే అవకాసముందని చెప్తున్నారు. అయితే అటువంటిదేమీ లేదని దర్శకుడు సుధీర్ వర్మ ఖండిస్తున్నారు.

'స్వామి రా రా' అంటూ తొలి ప్రయత్నంతోనే ఆకట్టుకొన్నారు సుధీర్‌ వర్మ. 'తడాఖా', 'మనం'... అంటూ విజయాల బాట పట్టారు నాగచైతన్య. వీరిద్దరూ మరో విజయం కోసం జట్టు కట్టారు. నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతిసనన్‌ హీరోయిన్. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

నాగచైతన్య మాట్లాడుతూ ''సుధీర్‌ వర్మ తీసిన 'స్వామి రా రా' నాకు బాగా నచ్చింది. నా కోసం ఓ మంచి కథ సిద్ధం చేశాడు. తప్పకుండా నా కెరీర్‌లో మంచి చిత్రంగా మిగులుతుందన్న నమ్మకం ఉంద''న్నారు.

Naga Chaitanya’s next gets a title

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ 'అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన ప్రసాద్ గారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి రారా తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు పూర్తి యాప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: సన్నీ ఎం.ఆర, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, పాటలు: శ్రీమణి, కృష్ణ చైతన్య, కో డైరెక్టర్: విజయ్ సిహెచ్, స్టిల్స్: శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, సమర్పణ: బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X