నాగచైతన్య 'ఒక లైలా కోసం' టీజర్ ఎప్పుడు

చిత్రం కాన్సెప్టు ను దర్శకుడు చెపుతూ... '' ఒక అమ్మాయి కోసం... ఆమె ప్రేమకోసం అబ్బాయి పడిన కష్టమే ఈ చిత్రం. వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. నాగచైతన్య కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాం. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా ఉంటాయి. మార్చి చివరి నాటికి టాకీ పార్టు చిత్రీకరణ పూర్తవుతుంది. ''అన్నారు.
దర్శకుడు విజయ్‌కుమార్ కొండా మాట్లాడుతూ... ''ఎనిమిది నెలలపాటు శ్రమించి కథను సిద్ధం చేశాం. 'గుండె జారి గల్లంతయ్యిందే' కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉంటుంది. సినిమా చూశాక బంధువుల పెళ్లికి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యని తెరపై కొత్త తరహాలో చూపించబోతున్నాం''అన్నారు.
బ్రహ్మానందం, అలీ, ప్రభు గణేషన్, నాజర్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్ పూడి. ఈ చిత్రానికి నిర్మాతః నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విజయకుమార్ కొండా.


Click it and Unblock the Notifications











