‘శైలజా రెడ్డి అల్లుడు’కి నాగార్జునకు లింకు ఉందా?
టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి...త్వరలో నాగ చైతన్య-అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి 'శైలజారెడ్డి అల్లుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

నాగార్జున మూవీతో లింకు?
అయితే ‘శైలాజా రెడ్డి అల్లుడు' మూవీ నాగార్జున 90ల నాటి హిట్ మూవీ ‘అల్లరి అల్లుడు' చిత్రానికి ఇన్స్‌స్పిరేషన్ అనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. అప్పట్లో ఈ చిత్రంలో నాగార్జున, మీనా జంటగా నటించారు.

వాణిశ్రీ స్థానంలో రమ్యకృష్ణ
1993లో వచ్చిన ‘అల్లరి అల్లుడు' చిత్రంలో అత్త పాత్రలో వాణిశ్రీ నటించింది. ఇపుడు ‘శైలజా రెడ్డి అల్లుడు' చిత్రంలో రమ్య కృష్ణ అత్తపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

సందర్భాలు వేరైనా పాయింటు అదే?
‘అల్లరి అల్లుడు' చిత్రాన్ని సీన్ టు సీన్ రీమేక్ చేయకుండా.... సినిమా కాన్సెప్టును మార్చి, సన్నివేశాలను మార్చి అత్త, అల్లుడు కోణంలో ‘శైలజా రెడ్డి అల్లుడు' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.

ఎంటర్టెనింగ్‌గా చెబితే హిట్టే
అత్త వర్సెస్ అల్లుడు ... కాన్సెప్టులు తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త కాక పోయినా వినోదాత్మకంగా, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో చెబితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. ఇంతకు ముందు మారుతి చేసిన సినిమాలు చూస్తే ఆయనలో ఆ టాలెంటు ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నాగ్‌కు ‘అల్లరి అల్లుడు’... చైతుకు ‘శైలజా రెడ్డి అల్లుడు’
నాగార్జున కెరీర్లో ‘అల్లరి అల్లుడు' చిత్రం ఎవర్ గ్రీన్ మూవీగా ఎలా నిలిచిందో.... నాగ చైతన్య కెరీర్లో ‘శైలజా రెడ్డి అల్లుడు' అదే తరహాలో నిలుస్తుందనే అంచనాలతో ఈ సినిమా ప్లాన్ చేశారట.


Click it and Unblock the Notifications











