ఆ హీరోయిన్‌తో ప్రేమికుల రోజుకు రెడీ అవుతున్న నాగచైతన్య.. ఇదీ సంగతి
అక్కినేని యువ హీరో నాగచైతన్య వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కోసం సిద్దమవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అది కూడా నాచురల్ బ్యూటీ సాయి పల్లవితో కలిసి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాడట చైతూ. అర్థం కాలేదా? అదేనండీ.. సాయి పల్లవితో నాగచైతన్య జోడీ కట్టిన కొత్త సినిమా విడుదల కోసం ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14 తేదీ ఫిక్స్ చేసేశారనేది టాక్.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న తెలిసిందే. ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్టుగా కొన్నిరోజుల క్రితం శేఖర్ కమ్ముల చెప్పాడు. కానీ తాజా సమాచారం మేరకు డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది.

అనుకున్నట్టుగా ఈ సినిమా పనులు పూర్తి కాకపోవడం షూటింగ్ ఆలస్యం జరిగిందని, ఈ నేపథ్యంలో డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి కావని టాక్ బయటకొచ్చింది. అందుకే ఈ సినిమాకు సరైన విడుదల తేదీ కోసం అన్వేషించిన శేఖర్ కమ్ముల ఫిబ్రవరి 14 తేదీ ఫిక్స్ చేశారని సమాచారం. ఆ రోజు లవర్స్ డే కావడం కారణంగా యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఫిలిం నగర్ టాక్.
తన దర్శకత్వ ప్రతిభతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేయ గల శేఖర్ కమ్ముల, నాచురల్ నటన కనబర్చి ప్రేక్షకుల మనసు దోచుకునే సాయి పల్లవి, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న నాగచైతన్య ముగ్గురి కలయికలో ఈ సినిమా రానుండటంతో ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య కెరీర్ లో 20 వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











