»   » సమంత-నాగ చైతన్య..... రూ. 7 కోట్ల డీల్?

సమంత-నాగ చైతన్య..... రూ. 7 కోట్ల డీల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Married Couple Again Re-unites... సమంత తపించిపోతోంది! ఒక్క అవకాశం ఇస్తే........

సమంత, నాగ చైతన్య వెండి తెరపై సూపర్ హిట్ జోడీ. రీల్ లైఫ్‌లో భార్యా భర్తలుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లోనూ పెళ్లి చేసుకుని ఏకం అయ్యారు. పెళ్లికి ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన 'ఏమాయ చేశావే', 'మనం' చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. మరి పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తే అంచనాలు భారీగా ఉండటం ఖాయం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఎవరి దర్శకత్వంలో అంటే...

ఎవరి దర్శకత్వంలో అంటే...

నాగ చైతన్య, సమంత జోడీగా త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

రెమ్యూనరేషన్ విషయంలోనే జాప్యం

రెమ్యూనరేషన్ విషయంలోనే జాప్యం

సమంత, నాగ చైతన్యలతో సినిమా చేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరూ కలిసి చేస్తున్న తొలి సినిమా కాబట్టి రెమ్యూనరేషన్ విషయంలో చైతు-సామ్ భీష్మించుకుని కూర్చోవడంతో నిర్మాతలు వారితో చర్చలు జరుపుతున్నారట.

 ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?

ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?

నాగ చైతన్య ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సమంత తన సినిమాకు రూ. కోటిన్నర వరకు చార్జ్ చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ చేస్తున్న సినిమా కావడంతో ఇద్దరికీ కలిపి రూ. 7 కోట్ల కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

అడిగిన మొత్తం ఇవ్వడానికి సిద్ధమైన నిర్మాతలు

అడిగిన మొత్తం ఇవ్వడానికి సిద్ధమైన నిర్మాతలు

ప్రస్తుతం టాలీవుడ్లో మీడియం రేంజి హీరోలు రూ. 5 నుండి 7 కోట్ల వరకు తీసుకుంటున్నారు. హీరోయిన్ రెమ్యూనరేషన్ అదనం. చైతు-సమంత పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న తొలి సినిమాకు భారీ అంచనాలు ఉండటం ఖాయం. ఈ నేపథ్యంలో ఇద్దరికీ కలిపి రూ. 7 కోట్లు ఇవ్వడం పెద్ద భారం ఏమీ కాదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

English summary
Naga Chaitanya & Samantha 7C Deal for next movie. First film after their marriage, both of them have come to a deal and are charging 7 Cr rupees as a remuneration for the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu