»   » నాగ చైతన్య, సమంత కాంబినేషన్ నాలుగోసారి..?

నాగ చైతన్య, సమంత కాంబినేషన్ నాలుగోసారి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య, సమంత.... కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేసేవె'తోనే జెడీ అదిరింది అనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన ‘ఆటో నగర్ సూర్య', ‘మనం' చిత్రాల్లోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ నాలుగోసారి జతకట్టిబోతున్నాట్లు టాక్.

దోచెయ్ సినిమా తరువాత నాగచైతన్య నటించబోయే కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సినిమాలో చైతూ సరసన సమంత అయితేనే బావుంటుందని భావిస్తున్నాడట చందూ మొండేటి.


Naga chaitanya-Samantha once again?

ఇక నాగ చైతన్య ‘దోచేయ్' సినిమా విషయానికొస్తే...
ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్ణయించారు. స్వామిరారా' ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రే.లి. పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.


ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Naga chaitanya next movie committed to Chandu Mundeti direction. For this movie the movie makers are plan to give a chance to Samantha.
Please Wait while comments are loading...