సమంతనే పక్కన పెట్టేశాడా?.. డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన నాగ చైతన్య!

ఏదైనా పదే పదే రిపీట్ అయితే జనాలు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా కొన్ని కాంబినేషన్‌లు వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా నాగ చైతన్య మాత్రం సమంతతో సినిమా అంటే వద్దని మొహం మీదే చెప్పేశాడట. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలా నాగ చైతన్య తిరస్కరించడానికి కారణాలేంటని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recommended Video

#NC20 : Naga Chaitanya's New Film Thank You Movie Opening | Vikram K Kumar
క్యూట్ కపుల్స్..

క్యూట్ కపుల్స్..

టాలీవుడ్‌లో నాగ చైతన్య సమంతలు క్యూట్ కపుల్స్‌గా చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతుంది. ఈ ఇద్దరూ ఎక్కడైనా కనిపించారా? అంటే అక్కడంతా సందడి వాతావరణం నెలకొంటుంది. అందుకే ఈ ఇద్దరిని పెట్టి సినిమాలు తీయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తుంటారు.

మజిలీ సూపర్ హిట్..

మజిలీ సూపర్ హిట్..

పెళ్లికి ముందు నాగ చైతన్య, సమంత కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే పెళ్లి తరువాత మాత్రం చాలా టైం తీసుకుని ఓ సినిమాలో నటించారు. అలా మజిలీ సినిమాతో చైసామ్ మ్యాజిక్ ఏంటో నిరూపించారు. మొత్తానికి మజిలీ సినిమా ఇద్దరి కెరీర్‌లో నిలిచిపోయేలా గొప్ప విజయాన్ని సాధించింది.

మరో చిత్రంలోనూ..

మరో చిత్రంలోనూ..

తాజాగా నాగ చైతన్య వద్దకు విక్రమ్ కే కుమార్ మరో స్క్రిప్ట్‌ను తీసుకెళ్లాడట. అందులోనూ సమంతను హీరోయిన్‌గా తీసుకుందామని చైతూకి సలహా ఇచ్చాడట. కానీ చైతూ మాత్రం సమంత వద్దని మొహం మీదే చెప్పాడని తెలుస్తోంది. దానికి కూడా కారణాలున్నట్టు సమాచారం.

నేహా మాలిక్ బీచ్ అందాలు.. గోవాలో అందాల ఆరబోత

ప్రతీసారి అదే..

ప్రతీసారి అదే..

ఇప్పటికే చాలా సార్లు కలిసి నటించాం.. ఇక ఆ జంటను చూసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారేమోనని చైతూ వద్దన్నాడటని తెలుస్తోంది. ఇంతకు ముందే మజిలీ సినిమాలో కలిసి నటించామని, అందుకే బ్రేక్ తీసుకుందామని అన్నాడట. విక్రమ్ కే కుమార్ దిల్ రాజు దర్శక నిర్మాతలుగా రాబోతోన్న ఈ సినిమా కోసం ఈ చర్చలన్నీ జరిగినట్టు తెలుస్తోంది.

టాలెంటెడ్ యాక్టర్ శ్రద్దా శ్రీనాథ్ గ్లామరస్ ఫోటోషూట్...

ముఖ్యమైన పాత్ర..

ముఖ్యమైన పాత్ర..

అయితే ఆ సినిమాలో హీరోయిన్‌ది ముఖ్యమైన పాత్ర అంతే కాకుండా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది.అందుకే సమంతను తీసుకుందామని చెప్పారట. కానీ చైతూ అలా అనడంతో ఇప్పుడు వేరే ఆప్షన్స్ కోసం చూస్తున్నారట. మరి చైతు పక్కన ఎవరు వస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X