»   »  నాగ చైతన్య చిత్రం టైటిల్ కి మహేష్ లింకు

నాగ చైతన్య చిత్రం టైటిల్ కి మహేష్ లింకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాల్లో సూపర్ హిట్టైన పాట పల్లవిని తీసుకుని టైటిల్ గా పెట్టడం కామన్ గా జరుగుతున్న విషయమే. తాజాగా నాగచైతన్య కూడా అదే రూట్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘సాహసం శ్వాసగా సాగిపో' అనే టైటిల్‌ను పెడుతున్నట్టు సమాచారం.

మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ‘ఒక్కడు' చిత్రంలోని పాటకు పల్లవిని ఈ సినిమాకు పెడుతుండడం విశేషం. ఈనెల 29న నాగార్జున పుట్టిరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారు. రీసెంట్ గా చైతూ చేసిన దోచేయ్ చిత్రం ఫ్లాఫ్ కావటంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగచైతన్య కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఏమాయ చేసావే' కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావటంతో బిజినెస్ సైతం బాగా జరుగుతందని భావిస్తున్నారు. దాదాపు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Naga Chaitanya says Saahasam Swasaga Saagipo?

మలయాళ భామ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన చేస్తోంది. ప్రస్తుతం బెంగుళూరులో షూటింగ్ జరుగుతోంది. అక్కడ నాగ చైతన్య, మంజిమ మోహన్, మిగిలిన ప్రముఖ నటీనటులపైన కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ప్రధానంగా నాగ చైతన్య, మంజిమ మోహన్ పై వచ్చే కొన్ని కీలకమైన లవ్ సీన్స్ ని బెంగుళూరు లో షూట్ చేస్తున్నారు.

ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళ వెర్షన్ లో కూడా మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

English summary
Now for Naga Chaitanya's next that is being helmed by Gautham Menon, we hear that Chaitu picked the title 'Saahasam Swasaga Saagipo', which happens to be lyrics of a song of Mahesh Babu. That's a super hit montage song from Superstar's first blockbuster 'Okkadu' movie. A.R.Rahman is scoring music for this film and it promises to be a romantic action entertainer!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu