twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతకు షాక్.. రెండో పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య.. ఈసారి కూడా హీరోయినే?

    |

    విడాకుల ప్రకటన తర్వాత అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలు ప్రకటిస్తూ ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి వచ్చిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అవుతున్నాయి. తాజాగా ఆయన తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా కూడా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ఆయన మరో పెళ్ళికి సిద్ధం అవుతున్నారు అని తెలుస్తోంది. అది కూడా ఒక హీరోయిన్ తో అని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    లవ్ స్టొరీ

    లవ్ స్టొరీ

    గత ఏడాది అక్టోబర్ నెలలో అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ఓ అధికారిక ప్రకటన చేశారు.. చాలా రోజుల నుంచి వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని త్వరలోనే వారు విడిపోవచ్చు అంటూ దానికి ముందు నుంచే ప్రచారం జరిగింది. అయితే అనూహ్య పరిస్థితుల్లో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే తాము విడిపోతున్నాము అని అధికారికంగా ప్రకటించారు.

     రాశి ఖన్నా హీరోయిన్ గా

    రాశి ఖన్నా హీరోయిన్ గా

    ఆ సినిమా తర్వాత నాగార్జునతో కలిసి నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

    వెంకట్ ప్రభుతో సినిమా

    వెంకట్ ప్రభుతో సినిమా

    దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య దూత అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ లో భాగంగా ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తమిళ సూపర్ హిట్ మనాడు సినిమాను తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరగగా అందులో నాగచైతన్య హీరోగా నటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది.

    హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడని

    హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడని

    కొద్దిరోజుల క్రితం వెంకట్ ప్రభు తాను అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నాను అంటూ అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య మళ్లీ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నారు.

    అధికారిక ప్రకటన ఎప్పుడో

    అధికారిక ప్రకటన ఎప్పుడో

    కానీ హీరోయిన్ పేరు మాత్రం బయటకు రాలేదు. నిజానికి నాగచైతన్య విడాకుల సమయంలో, మజిలీ నటి దివ్యాంశ కౌశిక్‌తో నాగచైతన్య రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకారు ఉంది. కానీ ఈసారి ఆమె పేరు బయటకు రాలేదు. కాబట్టి పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏదైనా అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదనే చెప్పాలి. అయితే ఈ ప్రచారం ఇప్పుడు ఎందుకు ఊపందుకుంది అనేది తెలియాల్సి ఉంది.


    English summary
    Naga Chaitanya’s marriage became the hot topic in the industry circles now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X