నాగచైతన్య లవ్ స్టోరీ.. లవర్స్ డేకి కష్టమే!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న తెలిసిందే. ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.
మొదట ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పాడు. కానీ లవ్ స్టోరీ నేపథ్యమున్న సినిమా కాబట్టి డిసెంబర్ నెలలో కాకుండా లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. అయితే తాజా సమాచారం మేరకు ఆ డేట్ లో కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది.

అనుకున్నట్టుగా ఈ సినిమా పనులు పూర్తి కాకపోవడం కారణంగా షూటింగ్ ఆలస్యం జరిగిందని, అందుకే ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. సో ఈ సినిమా లవర్స్ డేకి కష్టమే! అని తెలుస్తోంది.
తన దర్శకత్వ ప్రతిభతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేయ గల శేఖర్ కమ్ముల, నాచురల్ నటన కనబర్చి ప్రేక్షకుల మనసు దోచుకునే సాయి పల్లవి, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న నాగచైతన్య ముగ్గురి కలయికలో ఈ సినిమా రానుండటంతో ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య కెరీర్ లో 20వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











