నాగార్జునకు ఇష్టమైన ప్రాజెక్ట్.. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన తనయుడు.. మరో హీరోతో?

యంగ్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా ఇంకా టాలీవుడ్ నవ మన్మథుడు అనే ట్యాగ్ అక్కినేని నాగార్జున వద్దే ఉంది. ఆరు పదుల వయసులో ఉన్నా అదే ఎనర్జీతో ఉన్నారనే చెప్పాలి. ఎలాంటి హడావుడి లేకుండా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ కనిపించే ఆయాన ఆరోగ్య సూత్రం ఏమిటో గాని ఎప్పుడు ఒకే రకమైన ఫీట్నెస్ తో నేటితరం కుర్ర హీరోలకు ఒక చాలెంజ్ విసురుతూ ఉంటారు. ఇక సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ తో సిద్దమవుతున్న తరుణంలో నాగార్జున తనయుడు ఒక కారణం వల్ల హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

యువ హీరోయిన్ అత్మిక అందాల మోత...

 మరోసారి అదే పాత్రతో

మరోసారి అదే పాత్రతో


సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగ్ మరోసారి అదే పాత్రతో ఆకట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు.నాగార్జున కెరీర్ లో చాలా కాలం తరువాత బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.. 2016 సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. నాగ్ కెరీర్ అత్యదిక షేర్స్ అందించిన సినిమా కూడా అదే.

మొత్తానికి స్క్రిప్ట్ రెడీ..

మొత్తానికి స్క్రిప్ట్ రెడీ..

ఇక ఇప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ తోనే బంగార్రాజు టైటిల్ తో సినిమా చేయాలని కథ కూడా సెట్ చేయించాడు. ఈ సినిమా గత రెండేళ్ల నుంచి చర్చల దశలోనే ఉంది. ఇక ఫైనల్ గా ఇటీవల నాగ్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. మొన్నటివరకు వైల్డ్ డాగ్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడానికి వీలు ఓడలెడ్. ఇక వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తేవాలని డిసైడ్ అయ్యారు.

తప్పకున్న నాగచైతన్య

తప్పకున్న నాగచైతన్య

అయితే సినిమా అక్కినేని మల్టీస్టారర్ గా తెరకెక్కనున్నట్లు మొదటి నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. నిజానికి నాగ చైతన్య సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవడం వలన కళ్యాణ్ కృష్ణ అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా పాత్రను కూడా డిజైన్ చేశాడు. అయితే ప్రస్తుతం చైతన్య ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వలన చేయలేనని చెప్పేశాడట. కుదిరితే కొన్నాళ్ళు ఆగండని కూడా సలహా ఇచ్చాడట.

మరొక హీరోను..

మరొక హీరోను..

కానీ నాగార్జున బంగార్రాజు సినిమాను మళ్ళీ వచ్చే సంక్రాంతికి రెడీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే గాని అప్పటికి రెడీ అవ్వదు. అందుకే నాగ చైతన్య తప్పుడుకోవడంతో అతని పాత్రలో మరొకరిని తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే చైతూ కోసం సెట్ చేసిన ఆ పాత్ర చేయడానికి ఏ హీరో ఒప్పుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

రిలీజ్ ఎప్పుడంటే..

రిలీజ్ ఎప్పుడంటే..

ఇక కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే పలుమార్లు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇక మరోసారి అనూప్ రూబెన్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. ట్యూన్స్ కూడా ఆల్ మోస్ట్ రెడీ అయినట్లేనని తెలుస్తోంది. ఇక నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా చేయనున్నాడు. దానితో పాటు బంగార్రాజు స్టోరీని మొదలు పెట్టి 2022సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నాగ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X