అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ.. ఆ దేశంలో హాలీడే ట్రిప్.. పట్టేసిన నెటిజెన్లు!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగచైతన్య గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలతో వస్తూ సినీ ప్రియులను తెగ అలరిస్తున్న ఈయన తాజాగా ఓ కుర్ర హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ డేటింగ్ లో ఉన్నారని, అక్కడ కనిపించారని, ఇక్కడ కనిపించారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు మరోసారి దొరికిపోయారు. వారిద్దరూ కలిసే హాలీడే ట్రిప్ కు వెళ్లినట్లు నెటిజెన్లు పట్టేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతేడాది నాగ చైతన్య ఓ రెస్టారెంట్ లో ఫొటో దిగారు. ఆ ఫొటో వెనకాల శోభితా ధూళిపాళ కనిపించడంతో అంతా వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు మొదలు అయ్యాయి. ముఖ్యంగా శోభాతి ధూళిపాళ వల్లే సమంత, నాగ చైతన్యలు విడాకులు తీసుకున్నారంటూ కొందరు కథనాలు రాశారు. అయితే ఈ వార్తలపై గతంలోనే నాగ చైతన్య స్పందించాడు. తనకు శోభితతో ఎలాంటి ప్రేమ లేదని వివరించాడు. నాగ చైతన్య మాత్రమే శోభితా ధూళిపాళ కూడా ఇండైరెక్ట్ గా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

తను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు తాను తనపై వస్తున్న రూమర్లపై ఎందుకు స్పందించాలంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నుంచి వీరిపై పెద్దగా వార్తలు రాలేవు. కానీ తాజాగా మరోసారి వీరికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నాగ చైతన్య తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో ఎక్కడికో హాలీ డే ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే మరోవైపు శోభితా ధూళిపాళ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అయితే అందులో తాను ఓ ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే నాగ చైతన్య షేర్ చేసిన ఫొటోలు, శోభితా షేర్ చేసిన ఫొటోల్లో బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండడంతో వీరిద్దరూ కలిసే ట్రిప్ కు వెళ్లారంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రో విత్ శోభితా అని కొందరు, ఇద్దరూ కలిసి భలేగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
ముఖ్యంగా నాగ చైతన్య, శోభితా ధూళిపాళలు ఇటీవలే లండన్ కు వెళ్లారు. ఇద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ, డేటింగ్ నడుస్తోందని.. కచ్చితంగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందంటూ అంతా భావిస్తున్నారు. చూడాలి మరి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని.. విడాకులు తీసుకున్న నాగ చైతన్య మళ్లీ శోభితాను ప్రేమ వివాహం చేసుకుంటారా లేదా అనేది.


Click it and Unblock the Notifications











