నాగ చైతన్య , శోభితల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ..!

Naga Chaitanya-Sobhita Dhulipala: అక్కినేని వారింట్లో అతి తర్వలో బజాలు మోగాయి. త్వరలో నాగచైతన్య శోభితాలు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ జంటకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ నాగ చైతన్య-శోభితా పెళ్లి మూహుర్తం ఏంటీ? వివాహం ఎప్పుడంటే?

అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లల జంట గత కొద్ది నెలలుగా వార్తల్లో నిలుస్తుంది. హీరోయిన్ సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్న తరువాత.. శోభితతో డేటింగ్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత ఈ జంట మీడియా కంట పడటంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే.. ఈ రూమార్స్ పై ఎలాంటి క్లారిటీ రాకముందే.. ఓ అనూహ్య ఘటన జరిగింది. ఆగస్ట్ 8 న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ చేశారు.

Naga Chaitanya-Sobhita Dhulipala s wedding date revealed

ఈ వేడుక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ శోభిత ధూళిపాళ్ల ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి . ఆమె ఏ సినిమాల్లో నటించింది? అంటూ అక్కినేని ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేశారు. మీడియాలో కూడా పలు కథనాలు వచ్చాయి. అదే సమయంలో వీరి పెళ్లి గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. పెళ్ళి ఎప్పుడు చేయబోతున్నారు. వారి వివాహం ఎక్కడ జరగతోంది? అనే వివరాల కోసం వెయిట్ చేస్తున్నారు.

నిశ్చితార్థం తరువాత వీరిద్దరూ తరుచు తమ ఫోటోలను షేర్ చేస్తూ.. అక్కినేని అభిమానుల్లో ఓ ఎగ్జైటింగ్ ను క్రియేట్ చేశారు. తాజాగా.. నటసామ్రాట్‌ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2024 (ANR National Awards 2024) వేడుకకు అక్కినేని చైతన్యకు కాబోయే భార్య శోభితా కూడా విచ్చేసింది. ఈవెంట్లోశోభిత ట్రెడిషనల్ లుక్ లో అందర్నీ అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఈ ఈవెంట్ లో నాగచైతన్య శోభితల జంట సెంటర్ ఆఫ్ అట్రాక్టన్ గా నిలిచిన విషయం కూడా తెలిసింది. ఈ వేడుకలో తనకు కాబోయే కోడలిని చిరంజీవికి కూడా పరిచయం చేశాడు నాగార్జున. ఆ ఫంక్షన్ లో శోభిత కూడా కుటుంబ సభ్యురాలిగానే ఉంది.

Naga Chaitanya-Sobhita Dhulipala s wedding date revealed

ఈ వేడుకలో ఈ జంట పెళ్లికి గురించి ప్రస్తవన వచ్చినట్టు టాక్. తాజాగా సమాచారం ప్రకారం.. నాగ చైతన్య- శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో చేసుకోబోతున్నారు. నిశ్చితార్థ వేడుకలాగానే.. వివాహం వేడుకను కూడా చాలా సింపుల్ గా చాలా దగ్గర సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే శోభిత మెడలో నాగ చైతన్య తాళి కట్టబోతున్నారట. అయితే..ఈ ఈ వేడుకపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని, డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ నాలుగవ తేదీన పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. డిసెంబర్ 10 న డిన్నర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ పవిత్ర సందర్భంగా నటి సాంప్రదాయ పట్టు చీర, బంగారు నగలు, తక్కువ మేకప్‌తో కనిపించింది. ఈ వేడుకకు సబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో పంచుకుంది శోభిత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X