ఓటీటీలో నాగ చైతన్య- శోభితల పెళ్లి .. వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా?
Naga Chaitanya - Sobhita: తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ల భాజాలు మోగుతున్నాయి. సినీ సెలబ్రిటీలు, వారి వారసులు బ్యాచిలర్ లైఫ్ కు వీడ్కోలు చెబుతూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమకు నచ్చిన వారితో మూడుముళ్ల బంధంతో ఒకటై వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు. అలా అక్కినేని నాగచైతన్య - స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాల త్వరలో మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. అయితే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే..
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, శోభితల వివాహం డిసెంబర్ 4న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి పత్రికలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి వివాహా వేడుకలకు అతి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లిలో బంధువులు, సన్నిహితులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో జరగబోతున్నట్లు ప్రచారం.

అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినీ సెలబ్రెటీలు వారి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముకొని ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీని సెలబ్రిటీలు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్ముకొని వందల కోట్లు సంపాదించారు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెక్లెస్ దాదాపు 120 కోట్లు వెచ్చించినట్టు టాక్.
ఇటీవల లేడీస్ సూపర్ స్టార్ నయనతార- ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా అమ్మేసిన విషయం తెలిసిందే..వీరి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం దాదాపు రూ. 25 కోట్లు వెచ్చించినట్టు టాక్. ప్రస్తుతం నయనతార డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీకి వచ్చి ఆదరణ వస్తుంది.
అలాగే.. కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకోసం డిస్నీ హాట్ స్టార్ ఏకంగా రూ.80 కోట్లు బడ్జెట్ వెచ్చిందట.అలాగే.. బాలీవుడ్ మోస్ట్ బ్యూటీ పుల్ కపుల్స్ దీపికా పదుకునే- రణవీర్ సింగ్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ రూ.120 కోట్లు అమ్ముడుపోగా.. రణబీర్ కపూర్- అలియా భట్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ దాదాపు రూ.100 కోట్లు, ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా- నిక్ జోన్స్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్ ఏకంగా. $2.5 మిలియన్లు వెచ్చిందట. ఇలా స్టార్ హీరో, హీరోయిన్స్ ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం వందల కోట్లు వెచ్చిస్తుంది నెటిఫ్లిక్స్ .
ఈ ట్రెండ్ ను అక్కినేని నాగచైతన్య - శోభితలు కూడా ఫాలో కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే వారు తమ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందట. నాగచైతన్య-శోభితల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్లు టాక్. అయితే ఈ వార్తపై నాగచైతన్య ఫ్యామిలీ గాని, అటు శోభిత ఫ్యామిలీ గాని స్పందించలేదు. ఈ వార్తలు ఇంత నిజం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











