సునీల్ కి 'తడాఖా' చూపిస్తున్న నాగచైతన్య

By Srikanya

హైదరాబాద్ : నాగచైతన్య, సునీల్‌ హీరోలుగా శ్రీసాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'తడాఖా' అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. మొదట ఈ చిత్రానికి భలే తమ్ముడు అనే టైటిల్ అనుకున్నారు. కానీ అదీ పాత గా ఉందనిపించటంతో ఈ టైటిల్ ని పరిగణనలోకి తీసుకుని నాగార్జున కి తెలియచేసినట్లు తెలుస్తోంది. నాగార్జున ఓకే చేస్తే వెంటనే ఈ టైటిల్ తో ప్రకటన వస్తుందని వినపడుతోంది.

బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో నాగచైతన్య, సునీల్‌ అన్నదమ్ములుగా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. కొచెం ఇష్టం..కొంచెం కష్టం తో పరిచయమైన పి.కిశోర్‌కుమార్‌ (డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఇందులో సునీల్‌, నాగచైతన్య అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే ఆ సోదరులు చేసే సందడి ఆకట్టుకొంటుంది''అని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలోనే ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రారంభించనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.అందులోనూ గతంలో వచ్చిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక వెట్టై చిత్రం యాక్షన్‌, ప్రేమ, సెంటిమెంట్‌ సమాహారంతో రూపొందింది. తెలుగు వెర్షన్ లో మిగతా కీలక పాత్రల్లో ...బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్‌ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్‌, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్‌, పాటలు: చంద్రబోస్‌, సంగీతం: తమన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X