నాగచైతన్య, తమన్నా బావా మరదళ్ళుగా
నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న నూతన చిత్రం మే 19 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య, తమన్నా బావా, మరదళ్ళుగా కనిపించనున్నారు. అచ్చ తెలుగు వాతావరణంలో ఈ కథనం నడవబోతున్నదని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా ని పెయిర్ గా అనుకున్నారు .కానీ వరుణ్ సందేశ్ వరస ప్లాప్ లతో మునిగితేలుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సుకుమార్, బన్నీ కాంబినేషన్లో ఆర్య 2 వచ్చింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో నాగచైతన్య క్యారెక్టైరేజన్ విభిన్నంగా ఉంటుందని, ఓ పంక్షన్ నిమిత్తం అమ్మమ్మ, మేనమామల ఇంటికి వచ్చిన అతనికి అక్కడ జరిగే సందడి ఏమిటి అన్నది కథనంగా నడుస్తుందంటున్నారు. ఇక తమన్నా తండ్రిగా, హీరో మేనమామగా నాజర్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని వినపడుతోంది. ఇక తాను ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తమన్నా కూడా కన్ఫర్మ్ చేసింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..అల్లు అర్జున్ తో 'బద్రీనాథ్', నాగచైతన్యతో ఓ సినిమా, ధనుష్ పక్కన ఓ తమిళ చిత్రం, 'విక్రమార్కుడు' తమిళ రీమేక్..సినిమాలు చేయబోతున్నాను అంది. మరో ప్రక్క సిద్దార్ధ కూడా పల్లె వాతావరణంలో బావ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











