నాగచైతన్య చిత్రం టైటిల్...'బాలు వెడ్స్ మహలక్ష్మి' డిటేల్స్
నాగచైతన్య, తమన్నా ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఏప్రియల్ 15 న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి టైటిల్ ని 'బాలు వెడ్స్ మహలక్ష్మి' గా ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి దటీజ్ మహలక్ష్మీ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత ఐలవ్ యు మహలక్ష్మి అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ఈ రెండు కాక రెండిటినీ కలిపి 'బాలు వెడ్స్ మహలక్ష్మి' అని పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో మహలక్ష్మిగా తమన్నా కనిపించనుంది.కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ప్రెష్ గా ఫీలవుతారు అని చెప్తున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు. ఇంకా టైటిల్ ఏమిటన్నదే నిర్ణయం కాలేదు. నాగచైతన్య తన దర్సకుడు సుకుమార్ డెడికేటెడ్ డైరక్టర్. అయితే ఆ విషయం స్క్రిప్టు నేరేట్ చేస్తున్నప్పుడే అనుభవంలోకి వచ్చింది అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











