అక్కినేని ఫ్యాన్స్‌కు పండుగే: ఇదే మంచి సమయమంటూ చైతూను ఒప్పించిన సమంత.!

By Manoj Kumar P

టాలీవుడ్‌లో చాలా మంది హీరో, హీరోయిన్లు ప్రేమాయణం సాగించిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిలో ఎక్కువ మంది బ్రేకప్‌లు చెప్పిన వారే ఉన్నారు. అయితే, కొందరు మాత్రం తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. అలాంటి వారిలో అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత పేర్లు ప్రముఖంగా చెప్పుకుంటారు. చాలా కాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించకున్న ఈ జంట.. కొన్నేళ్ల క్రితం ఒక్కటైంది. ఈ నేపథ్యంలో సామ్ ఒత్తిడితో చైతూ కీలక నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం త్వరలోనే అక్కినేని ఫ్యాన్స్ గుడ్ న్యూస్ వినబోతున్నారట.

 సమంత వరుస విజయాలకు బ్రేక్ పడింది

సమంత వరుస విజయాలకు బ్రేక్ పడింది


త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ' నుంచి సమంత వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. దీని తర్వాత ఆమె వరుసగా ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి హిట్లు దక్కించుకుంది. అలాగే, తమిళంలోనూ ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్'లతో సత్తా చాటింది. కానీ, ఇటీవల వచ్చిన ‘జాను' మాత్రం నిరాశ పరిచింది.

సమంతతో కలిశాక చైతూకు సక్సెస్ వచ్చింది

సమంతతో కలిశాక చైతూకు సక్సెస్ వచ్చింది

సమంత వరుస విజయాలను అందుకుంటుంటే.. నాగ చైతన్య కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగుతూ వస్తోంది. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో భార్య సమంతతో కలిసి అతడు నటించిన చిత్రం ‘మజిలీ'. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు అతడిని హిట్ ట్రాక్ ఎక్కించింది. దీని తర్వాత చైతూ ‘వెంకీ మామ'తో మరో హిట్ అందుకున్నాడు.

 సమంత గ్యాపిచ్చింది.. చైతూ స్పీడు పెంచాడు

సమంత గ్యాపిచ్చింది.. చైతూ స్పీడు పెంచాడు

తమిళ చిత్రం ‘96'కు రీమేక్‌గా వచ్చిన ‘జాను' సమంత అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇందులో ఆమె నటన బాగున్నా.. సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. ఇక, సామ్ నటిస్తున్న చిత్రాలేవీ ప్రస్తుతానికి లేవు. అయితే, చైతూ మాత్రం ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ‘లవ్ స్టోరీ'లో నటిస్తున్నాడు. అలాగే, కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Recommended Video

Naga Chaitanya Emotional Words On Police
చైతన్యకు హ్యాండ్ ఇచ్చిన వంద కోట్ల డైరెక్టర్

చైతన్యకు హ్యాండ్ ఇచ్చిన వంద కోట్ల డైరెక్టర్

‘లవ్ స్టోరీ' తర్వాత నాగ చైతన్య.. డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ, ‘గీత గోవిందం'తో వంద కోట్ల దర్శకుడిగా పేరొందిన ఆయన.. చైతూ సినిమాను పక్కన పెట్టేశాడు. దీనికి కారణం పరశురామ్‌కు మహేశ్ బాబు నుంచి కబురు రావడమే. ఈ సినిమా కారణంగా నాగ చైతన్యకు ఆయన హ్యాండ్ ఇచ్చాడు.

 భర్తకు అదిరిపోయే సలహా ఇచ్చిన సమంత

భర్తకు అదిరిపోయే సలహా ఇచ్చిన సమంత

కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ‘లవ్ స్టోరీ' ఇప్పటికే విడుదల అయ్యేది. కానీ, అది వాయిదా పడిపోయింది. దీని తర్వాత చైతూ ఒప్పుకున్న చాలా చిత్రాలు ఉన్నప్పటికీ.. ఆ దర్శకులందరూ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమంత.. చైతూకు అదిరిపోయే సలహా ఇచ్చిందని సమాచారం. దీని ప్రకారం.. అతడు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డితో సినిమా చేయనున్నాడట.

ఇదే మంచి టైం అంటూ చైతూను ఒప్పించింది

ఇదే మంచి టైం అంటూ చైతూను ఒప్పించింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో చైతన్య సినిమా చేసే అవకాశాలు లేవు. కాబట్టి కొంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే నందినీ రెడ్డితో సినిమా చేయమని సమంత చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథను విన్న వెంటనే చైతూ ఒప్పుకున్నాడని అంటున్నారు. అంతేకాదు, ఇందులో సామ్ కూడా నటించే చాన్స్ ఉందట. ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X