అల్లు అరవింద్ ఎగ్రిమెంట్ పై నాగచైతన్య మండిపాటు
సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య,తమన్నా కాంబినేషన్ లో '100% లవ్"అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై నాగచైతన్య పూర్తిగా సంతృప్తి గా లేడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి లిమిడెట్ రోజులు,లిమెటెడ్ బడ్జెట్ అంటూ అల్లు అరవింద్ కండీషన్స్ పెట్టి సుకుమార్ తో ఎగ్రిమెంట్ రాయించుకున్నాడు. అలా రాయించుకోవటంతో నాగచైతన్య ఫీలవుతున్నాడని చెప్పుకుంటున్నారు.
అదే తన కుమారుడు సినిమా బద్రీనాధ్ కి పెట్టని కండీషన్స్ తన చిత్రానికి పెట్టడంతో అనుకున్న క్వాలిటీలో సుకుమార్ ఇవ్వలేకపోయే అవకాశం ఉందని మొదటనుంచి నాగచైతన్య మధనపడుతున్నట్లు వినికిడి.అయితే సుకుమార్ గతంలో ఆర్య 2, జగడం చిత్రాలుకు లెక్కలేకుండా బడ్జెట్,వర్కింగ్ డేస్ ఖర్చుపెట్టి ఫ్లాఫ్ సినిమాలు తీయటంతో అల్లు అరవింద్ ఈ నిర్ణయం తీసుకుని కంఢీషన్స్ పెట్టడం జరిగింది.ఇక ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రియల్ 8)న ఎరేంజ్ చేయటం కూడా నాగచైతన్యకు మింగుడపడని అంశమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











