నాన్న కోసం ఒక సినిమాను వదులుకున్న నాగ చైతన్య?
అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టాడు. కథ నచ్చితే డేట్స్ తో సంబందం లేకుండా ముందైతే ఒకే చెప్పేశాడు. అయితే కొన్ని సినిమాలకు ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేక సడన్ గా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తోందట.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న నాగ చైతన్య ఆ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకే అయ్యింది. అయితే నాగార్జున బంగార్రాజు సినిమా కోసం ఒకే చెప్పిన చైతన్య ఆ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.

బంగార్రాజు సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అందులో మరొక పాత్ర కోసం అఖిల్ ను లేదా చైతన్యను తీసుకోవాలని అనుకున్నారు. అఖిల్ సోలో హిట్ కోసం సురేంధర్ రెడ్డి సినిమాతో కష్టపడుతుండడంతో నాగచైతన్యను ఫైనల్ చేశారు. బంగార్రాజు సోగ్గాడే చిన్న నాయనా సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. ఇక ఆ సినిమాను ఎలాగైనా వచ్చే సంక్రాంతి రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడంతో చైతన్య మరో సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











