'దూకుడు' టైప్ లో నవ్వించనున్న నాగచైతన్య చిత్రం
హైదరాబాద్: అక్షయ్ కుమార్,కత్రినా కైఫ్ కాంబినేషన్ రూపొంది, ఘన విజయం సాధించిన 'వెల్‌కమ్'ను తెలుగులో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మోహన్ బాబు (నానాపటేకర్ పాత్రలో), నాగచైతన్య(అక్షయ్‌కుమార్ కేరక్టర్‌లో) కలిసి నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు వీరు పోట్ల దర్శకత్వం వహిస్తారు. పిభ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఒరిజనల్ స్క్రిప్టులోని అంశాలకు కొద్ది మార్పులు చేసి,తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య పాత్రను అమాయకుడుగా కాకుండా,హీరోయిజం కలిపి మార్చారని వినికిడి.
ఇక మహేష్ దూకుడు చిత్రంలో ఎమ్.ఎస్ నారాయణ సినిమా పిచ్చి పాత్ర ఎంత క్లిక్ అయ్యిందో తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోనూ డాన్ గా ఉండే మోహన్ బాబుకి సినిమా పిచ్చి ఉంటుందని, దాన్ని ఆసరా చేసుకుని, ఆ పిచ్చితో హీరో ఎలా ఆడుకున్నాడనేది ఫన్నీగా స్క్రిప్టు మార్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అంత పెద్ద డాన్ కూడా (మనీలో బ్రహ్మానందం తరహాలో...) సినిమా పిచ్చితో చేసే చేష్టలు, సినిమా నిర్మాణంలో అతనిలో హీరో తీసుకు వచ్చే మార్పులు సినిమాకు కీలకంగా నిలుస్తాయని వినిపిస్తోంది. ఇది నాగచైతన్యకు దూకుడు లాంటి చిత్రం అవుతుందని చెప్పుకుంటున్నారు.
ఇక దర్శకుడు వీరూపోట్ల గతంలో నాగార్జునతో రగడ చిత్రం డైరక్ట్ చేసి ఉన్నారు. అలాగే మంచు మనోజ్ తో బిందాస్ తో దర్శకడుగా మారారు.ఈ సినిమాను తెలుగుకు తగ్గట్టుగా తీర్చి దిద్దే పనిని రచయితలు కోనవెంకట్, బీవీఎస్ రవి, గోపి మోహన్ లు ఛాలెంజ్ గా తీసుకుని చేసారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రచయితల జంట దేనికైనా రెడీ చిత్రంతో మంచి పామ్ లో ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం 'ఆటో నగర్ సూర్య' చిత్రంతోపాటు.... సునీల్‌తో కలిసి వెట్టై చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా నాగచైతన్య మోహన్ బాబుతో సినిమాకు కమిట్ కావడం గమనార్హం. ఈ మధ్య వరుస ప్లాపులతో డీలా పడ్డ చైతూ...ఈ మల్టీస్టారర్ మూవీలతోనైనా తన రాత మార్చుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











