twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ చైతన్య, మోహన్ బాబు కాంబినేషన్లో ‘వెల్ కమ్’!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తన తండ్రి మోహన్ బాబుతో శ్రీవాస్ దర్శకత్వంలో సొంత బేనర్‌పై సినిమా చేస్తున్న నటుడు మంచు విష్ణ ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వెల్‌కమ్ ' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోందని తెలుస్తోంది.

    'వెల్ కమ్' చిత్రంలో అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ నటించారు. దీనికి రీమేక్ గా తెలుగులో రూపొందబోయే చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్రలో నాగ చైతన్య, అనిల్ కపూర్ పాత్రలో మోహన్ బాబు, మరో ముఖ్య పాత్రలో శ్రీహరి నటించనున్నారని తెలుస్తోంది. పలు టీవీ చానళ్లు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఈ సినిమాను తెలుగుకు తగ్గట్టుగా తీర్చి దిద్దే పనిని రచయితలు కోనవెంకట్, బీవీఎస్ రవి, గోపి మోహన్ లు స్వీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరు దేనికైనా రెడీతో మంచి పామ్ లో ఉన్నారు. 2013లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.

    ఈ మధ్య టాలీవుడ్లో మల్టీ స్టారర్ సినిమాలపై బాగా క్రేజ్ ఏర్పడింది. వెంకీ-మహేష్ కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంపై భారీ అంచనాలు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మల్టీస్టారర్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు పలువురు నిర్మాతలు.

    నాగ చైతన్య ప్రస్తుతం 'ఆటో నగర్ సూర్య' చిత్రంతోపాటు....సునీల్‌తో కలిసి వెట్టై చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా నాగ చైతన్య మోహన్ బాబుతో సినిమాకు కమిట్ కావడం గమనార్హం. ఈ మధ్య వరుస ప్లాపులతో డీలా పడ్డ చైతూ...ఈ మల్టీస్టారర్ మూవీలతోనైనా తన రాత మార్చుకుంటాడో చూడాలి.

    English summary
    Naga Chaitanya is going to reprise Akshay Kumar’s role in this action comedy and the film also stars Mohan Babu and Sri Hari in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X