అతిరథ మహారథుల వారుసుడిగా తెరంగేట్రం చేస్తున్న 'యువనట సామ్రాట్' అక్కినేని నాగచైతన్యకు వాళ్ల మేనమామ లక్షణాలొచ్చాయని తల్లి లక్ష్మి చెబుతోంది. వివిధ ఫంక్షన్స్‌లో చైతన్య తండ్రి నాగర్జున మాత్రమే కనిపించారు. చైతూ (నాగచైతన్య ముద్దుపేరు) తల్లి లక్ష్మీ గురించి ఆ సందర్భంలో మీడియా ఎంతగానో ఎదురుచూసింది. తన తనయుడి సినీ ప్రవేశంతో మీడియా ముందుకు రాకతప్పలేదు. ఇటీవలే ఆమె మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. లక్ష్మీ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. చైతూ సినీ ప్రవేశం గురించి ఆనందం వ్యక్త చేస్తూ అనేక విషయాలు వెలుబుచ్చారు. 'ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటే ఆ రంగంలో వెళ్లే అవకాశం చైతుకు ఉంది. కానీ సినీ హీరోగా కనబడాలని చైతూ మనసావాచా కోరుకుంటున్నాడు. చూడడానికి తండ్రి నాగార్జునలా కనబడ్డా... మేనమామ వెంకటేష్ గుణాలు వచ్చాయి. మనసు మాత్రం అన్నయ్యలాంటిదే. తల్లిగా నా ఆశిస్సులు పూర్తిగా ఉంటాయి' అని చైతూ గురించి వివరించింది.