Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సీనియర్ నటుడి దర్శకత్వంలో నాగ చైతన్య.. వరుసగా 5 సినిమాలు
టాలీవుడ్ హీరోలు లాక్ డౌన్ వల్ల గ్యాప్ ని ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు గాని రానున్న రోజుల్లో మాత్రం తీరిక లేకుండా బిజీ కానున్నారని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వీలైనంత వరకు వచ్చే రెండేళ్లలో నలుగైదు సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే నాగ చైతన్య కూడా ఇప్పుడు అదే తరహాలో కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ హీరో చేతుల్లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇటీవల మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కూడా మరో సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పరశురామ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక త్వరలో మోహన్ కృష్ణ ఇద్రగంటి డైరెక్షన్ లో కూడా సినిమా చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
ఫైనల్ గా సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరువురి మధ్య ఒక సీరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథపై చర్చలు జరిగాయట. అయితే స్టోరీ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్దమైన తరువాతే ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని చైతన్య డీల్ సెట్ చేసుకున్నట్లై టాక్. ఈ సినిమా ఫిక్స్ అయితే నాగ చైతన్య మరో రెండు మూడేళ్ళ వరకు కొత్త సినిమాను స్టార్ట్ చేయలేడని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.