రీమేక్ కు నాగచైతన్యను తీసుకున్నారా
హైదరాబాద్ : తడాఖా రీమేక్ తో హిట్ కొట్టిన నాగ చైతన్య ... మరో రీమేక్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మళయాళ చిత్రం 'బెంగుళూరు డేస్'రీమేక్ లో నాగ చైతన్యను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రముఖ నిర్మాతలైన పివిపి మరియు దిల్ రాజు కలిసి ఓ మళయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. అందులో ముగ్గురు హీరోలు ఉంటారు. 'బెంగుళూరు డేస్'మలయాళంలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయ్యింది. చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ కానీ ఈ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది. ఈ చిత్రం కోసం నటుడు ఆర్య, భరత్, క్రేజీ నటి సమంతలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. ఒరిజినల్ చిత్రంలో పాహత్ పాజిల్, దుల్క సల్మాన్, నివిన్ పౌలి, నజ్రియ నజీమ్, నిత్యమీనన్ వంటి యువ తారలు నటించారు.
తమిళం, తెలుగు, భాషల్లోను అలాంటి యువ హీరో హీరోయిన్లను నటింప చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రెండు భాషల్లోనూ వేర్వేరు నటీ నటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











