నాగచైతన్య తో తమన్నా మరోసారి... ఏ సినిమానో తెలుసా ?

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా 'స‌వ్య‌సాచి' . కొత్త హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.

అక్కినేని నాగార్జున కెరీర్‌లో మంచి హిట్ సినిమాగా నిలిచిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసి పాటను సవ్యసాచి సినిమాలో రీమిక్స్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ, నాగార్జున నర్తించిన ఈ పాట అప్పట్లో హిట్ సాంగ్ గా నిలిచింది. సవ్యసాచి సినిమాలో ఈ పాటను ఒక సందర్భంలో పెట్టబోతున్నట్లు సమాచారం.

naga chaitnyta and thamanna team up once again!

జూన్ రెండోవారంలో చిత్రీకరించబోయే ఈ సాంగ్ లో తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమన్నా, నాగ చైతన్య జంటగా 100% లవ్ సినిమాలో నటించడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X