For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

  |

  టాలీవుడ్‌తో తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు. ఇలా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే మూడు రోజుల క్రితమే నాగశౌర్య తన గర్ల్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కట్నం గురించిన కొన్ని వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

   కాక్‌టైల్ పార్టీ.. ఫుల్ సందడిగానే

  కాక్‌టైల్ పార్టీ.. ఫుల్ సందడిగానే

  టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య.. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో చాలా రోజుల క్రితమే ప్రేమలో పడ్డాడు. దీంతో వీళ్లిద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. నవంబర్ 20న ముహూర్తం కావడంతో అంతకు ముందు రోజు కాక్‌టైల్ పార్టీని నిర్వహించారు. ఇందులోనే నాగశౌర్య, అనూషకు ఉంగరాన్ని తొడిగాడు. ఆ తర్వాత అంతా కలిసి తెగ సందడి చేసేశారు.

  బ్రాతో యాంకర్ రష్మీ ఓవర్ డోస్ హాట్ షో: తొలిసారి ఇలా తెగించిన బ్యూటీ

  ప్రేమ వివాహం చేసుకున్న హీరో

  ప్రేమ వివాహం చేసుకున్న హీరో

  ముందుగా నిశ్చయించినట్లుగానే అనూష శెట్టిని హీరో నాగశౌర్య నవంబర్ 20వ తేదీన వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వేడుకలో ఆమె మెడలో మూడుముళ్లు వేసేశాడు. ఎంతో సందడిగా సాగిన ఈ పెళ్లిలో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇది బెంగళూరులోని ఓ హోటల్‌లో జరిగింది.

  నాగశౌర్య పెళ్లి రిసెప్షన్ ఏర్పాట్లు

  నాగశౌర్య పెళ్లి రిసెప్షన్ ఏర్పాట్లు

  వాస్తవానికి వివాహానికి ముందే హీరో నాగశౌర్య ఓ సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆస్పత్రి నుంచి నేరుగా బెంగళూరు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న మ్యారేజ్ రిసెప్షన్ వాయిదా పడినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే నాగశౌర్య నుంచి ప్రకటన వస్తుందని అంటున్నారు.

  మళ్లీ రెచ్చిపోయిన రీతూ చౌదరి: ఎద అందాలు కనిపించేలా హాట్ షో

  నాగశౌర్య కట్నం హాట్ టాపిక్‌గా

  నాగశౌర్య కట్నం హాట్ టాపిక్‌గా

  టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వివాహం చేసుకున్న తర్వాత.. అతడు తీసుకున్న కానుకల గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు అంత డబ్బు ఇచ్చారు.. ఇంత డబ్బు ఇచ్చారు.. అంటూ ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. దీంతో నాగశౌర్య డౌరీ న్యూస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది.

  అనూష శెట్టి పేరిట కోట్ల ఆస్తులు

  అనూష శెట్టి పేరిట కోట్ల ఆస్తులు

  హీరో నాగశౌర్య పెళ్లి చేసుకున్న అనూష శెట్టి బ్యాగ్రౌండ్ గురించి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఆమె న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసుకుంది. అంతేకాదు, ప్రస్తుతం సొంత కంపెనీ పెట్టుకుని ఇంటీరియర్ డిజైనర్ వ్యవహరిస్తోంది. ఇక, ఆమె పేరిట దాదాపు రూ. 80 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  Bigg Boss Elimination: తొలిరోజే షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని ప్లేయర్.. ప్రమాదంలో ఆ లేడీస్

  నాగశౌర్యకు సగం షేర్స్ రాసేసి

  నాగశౌర్యకు సగం షేర్స్ రాసేసి

  పెళ్లి తర్వాత టాలీవుడ్ హీరో నాగశౌర్య తీసుకున్న కట్నం గురించి వస్తున్న వార్తల ప్రకారం.. అనూష శెట్టి తన కంపెనీలోని యాభై శాతానికి పైగా షేర్లను, తన పేరిట ఉన్న ఆస్తుల్లో సగభాగాన్ని భర్త నాగశౌర్య పేరిట రాసేసిందని తెలిసింది. అలా అతడికి దాదాపు రూ. 50 కోట్ల వరకూ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, భర్త కోసం ఆమె ఎన్నో విలువైన కానుకలు కూడా ఇచ్చారట.

  అన్ని కోట్లు కానుకలు ఇచ్చారు?

  అన్ని కోట్లు కానుకలు ఇచ్చారు?

  నాగశౌర్యకు అనూష శెట్టి తండ్రి కూడా చాలా కానుకలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమాచారం ప్రకారం.. మామగారి నుంచి అతడికి మరో రూ. 25 కోట్లు కూడా అందినట్లు తెలిసింది. వీటితో పాటు బెంగళూరులో ఓ విలువైన ఫ్లాట్‌ను కూడా నాగశౌర్యకు కొనిచ్చారట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ వివరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

  English summary
  Tollywood Hero Naga Shaurya Gets Married To Her Girlfriend Anusha Shetty Recently. Now His Dowry News Goes Hot Tipc in Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X