»   » బాలకృష్ణ తాజా చిత్రంలో మెగా బ్రదర్

బాలకృష్ణ తాజా చిత్రంలో మెగా బ్రదర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తెలుగులో దేశంలో జాయిన్ కావటం లేదంటూ ప్రెస్ నోట్ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబుకి బాలకృష్ణకు పార్టీలకు అతీతంగా మంచి రిలేషన్ ఉంది. తాజాగా బాలకృష్ణ తాజా చిత్రం లెజెండ్(ప్రచారంలో ఉన్న టైటిల్) లో నాగబాబు ఓ కీలకమైన పాత్ర చేస్తున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై తెరకెక్కిస్తున్నారు.గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనీల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా చేస్తున్నారు.


ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి అలరించనున్నారని తెలుస్తోంది. అవీ తండ్రీ కొడుకులు పాత్రలు అని చెప్తున్నారు. ఇక తండ్రి పాత్రకు జోడీగా నదియా నటిస్తుందనే ప్రచారం అంతటా జరుగుతోంది. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన సింహా చిత్రంలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. డాక్టర్ గా,లెక్చరర్ గా రెండు పాత్రల్లో అదరకొట్టారు. మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేసి హిట్ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు.

అత్తారింటికి దారేది చిత్రంతో వచ్చిన అత్త స్టార్‌డమ్‌ను నదియా బాగా ఆస్వాదిస్తోంది. కథలు కూడా అన్నీ విని నచ్చితేనే, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. ఓ రకంగా హీరోయిన్‌కన్నా ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని సమాచారం. తాజాగా బాలకృష్ణ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైందని సమాచారం. అయితే తండ్రీ కొడుకులుగా బాలయ్య నటిస్తున్న ఈ చిత్రంలో చిన్న బాలయ్యకు అత్తగా నటిస్తుందా? లేక పెద్ద బాలయ్యకు జోడీగా నటిస్తుందా అన్న విషయం త్వరలో తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.

ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అంతా మొదట అనుకున్నారు. కానీ పిబ్రవరికి వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి ల లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయనుండటంతో ఈ చిత్రం కొంత వరకూ హెల్ప్ అవుతుందని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దర్శకుడు మాట్లాడుతూ.... ''యాక్షన్‌ తరహాలో సాగే బాలకృష్ణ మార్కు సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దుతున్నారని'' అన్నారు. సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం.

English summary
Buzz is Nagababu will be teaming up with Balakrishna in his upcoming action entertainer ‘Legend’ under Boyapati Srinu. More details will be revealed soon. Radhika Apte, Shradda Kapoor are starring in the film. Devi Sri Prasad is the music director. Film is produced on 14 Reels Entertainment and Varahi Chalana Chitram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu