'ఆరెంజ్ స్కామ్' నాగబాబుని బావమరిది రమేష్ మోసం చేసాడా?
తన అన్న కొడుకు రామ్ చరణ్ ని హీరోగా పెట్టి నాగబాబు రీసెంట్ గా ఆరెంజ్ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని బావ మరిది నిర్మాత అయిన మన్యం రమేష్ ని ప్రొడక్షన్ సైడ్ తీసుకున్నాడు. అయితే బావ ఇచ్చిన అవకాశాన్ని అమాయకత్వంగా భావించి రమేష్ అక్కడే దెబ్బకొట్టాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...ఆరెంజ్ చిత్రం బడ్జెట్ పెరగి 32 కోట్లు కావటంలో రమేష్ ది కీలకపాత్ర ఉందని చెప్తున్నారు. రమేష్ స్వయంగా దాదాపు ఆరు కోట్ల రూపాయలు వరకూ నొక్కేసాడని, అందుకే బడ్జెట్ పెరుగుతోందన్నా క్వాలిటీగా సినిమా వస్తోందని, సినిమా సంచలనం సృష్టిస్తుందని బావ దగ్గర నమ్మబలికి ముంచేసాడని చెప్పుకుంటున్నారు. ఆడియో రిలీజ్ నాటికి కోటిన్నర లాభం వస్తుందని చూపిన మన్యం రమేష్ సినిమా రిలీజ్ నాటికి ఆరు కోట్లు డెఫిషిట్ చూడాడని, అది రెండు రోజులు దాటేసరికి దాదాపు 18 కోట్లు వరకూ నష్టంగా చూపే ప్రయత్నం చేసాడని అప్పుడు మేలుకున్న నాగబాబు స్వయంగా రంగంలోకి దిగి లెక్కలు తేల్చి చూస్తే ఆరు కోట్లు లెక్క తేలలేదని, ఆ తర్వాత అది రమేష్ సొంతమయిందని తెలుసున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రమేష్ ఓ రెండు రోజుల వరకూ ఎవరికీ కనపడలేదని, కంగారు పడ్డ అతని భార్య నాగబాబుని కలుసుకుని క్షమించమని వేడుకోవటంతో వేరే దారిలేక వదిలేసాడని చెప్తున్నారు. ఇక రమేష్ ఆ డబ్బుతో మరో సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక మన్యం రమేష్ గతంలో స్టాలిన్, గుడుంబా శంకర్ చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసారు. ఆ తర్వాత మన్యం ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టి 10-ది స్ట్రేంజర్స్, ముని, పార్ధు, హీరో, ఆకాశరామన్న చిత్రాలు నిర్మించారు.


Click it and Unblock the Notifications











