మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్?
హైదరాబాద్: ఇప్పటి వరకు మెగా స్టార్ కుటుంబం నుంచి దాదాపు అరడజనుకుపైగా హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి ఒక్క హీరోయిన్ కూడా వెండి తెరకు పరిచయం కాలేదు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్లు మొదటి నుంచీ పూర్తిగా సినీ రంగానికి దూరంగానే ఉంటూ వచ్చారు.
తాజాగా తొలిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ చిత్ర సీమకు పరిచయం అవుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాగ బాబు తనయ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందని, ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.... అక్కినేని నాగార్జున సినీ వారసుడిగా త్వరలో వెండితెర ఆరంగ్రేటం చేయబోతున్న అఖిల్ చేయబోయే తొలి సినిమాలో నిహారిక హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ, పవన్ కళ్యాన్ హీరోగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా-అక్కనేని కుటుంబాలకు చెందిన వారు హీరో హీరోయిన్లుగా సినిమా రాబోతుందనే వార్త సర్వత్రా చర్చనీయాంశం అయింది.
అయితే నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ పరిచయం అవుతుందనే విషయం ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. మరో వైపు అక్కినేని అఖిల్ చేయబోయే సినిమా కూడా అఫీషియల్ గా ఖరారు కాలేదు. ఏది ఏమైనా అక్కినేని-మెగా కుటుంబ హీరో హీరోయిన్ల కాంబినేషన్ సినిమా వస్తే మాత్రం.... అంచనాలు భారీగా ఉండటం ఖాయం.


Click it and Unblock the Notifications











