పవన్ ఫ్యాన్స్ ని నాగబాబు బుజ్జగిస్తాడా..?

మెగా ఫాన్స్ లో ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరూ చిరు ఫ్యాన్స్ వేరు అన్నంతగా చీలిక వచ్చేట్టుంది. రావటం చిరు కి తమ్ముడు గానే వచ్చినా మెగాశ్తార్ కి ఉన్నంత ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు పవన్., అయినా ఎప్పుడూ చిరుని తక్కువ చేయలేదు, కానీ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరికి వారు తామేంటీ అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి అనివార్యం అయ్యింది.

అయితే ఈ అన్నా తమ్ముళ్ళ మధ్య ఉన్న వివాదం మీద అనుమానాలు తీరక ముందే "సరైనోడు" హిట్ తరువాత ఈక్వేషన్లు మరింత మారి మెగా ఫాన్స్ లో అల్లు అర్జున్ ఫాన్స్ కూడా చీలిపోయి మరో ప్రధాన వర్గంగా ఏర్పడ బోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనికి తోడు ఈమధ్య "అఖిల భారత అల్లు సంఘం" ఏర్పడటం, విజయవాడలో జరిగిన "సరైనోడు" సక్సెస్ మీట్ లో జరిగిన సంఘటనలు ఈ అనుమానాలను మరింత ఎక్కువచేసింది.

చిరంజీవి మీద ఒక రేంజ్ లో అభిమానం ప్రకటించిన బన్నీ అదే వేదిక పై పవన్ అభిమానులు కోరికను మాత్రం తిరస్కరించి "చెప్పను బ్రదర్" అని నిర్మొహమాటంగా చెప్పడంతో అప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తో చికాకులో ఉన్న పవన్ అభిమానులను మరింతగా రెచ్చగొట్టింది.

Nagababu Discuss With Pawan Kalyan Fans

ఎప్పటి మాదిరే సోషల్ మీదియా ఈ యుద్దానికి వేదికయ్యింది. రోజురోజుకు అల్లుఅర్జున్ ను టార్గెట్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ శ్రుతిమించి పోతున్నాయి. కొందరు పవన్ వీరాభిమానులు తమ అభిమాన హీరో శిఖరం అయితే పవన్ ప్రస్తావన చెప్పడానికి ఇష్టపడని హీరోలు మట్టి దిబ్బ అంటూ బన్నీ పేరును ప్రస్తావించకుండా ఘోటైన సెటైర్లు కుడా పోస్ట్ చేస్తున్నారు.

దీనికి తోడు కొందరు అల్లుఅర్జున్ వీరాభిమానులు "అఖిల భారత అల్లు సంఘం" అనే సంస్థను ఏర్పాటు చేయడం కూడ మెగా కుటుంబ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఈ కామెంట్స్ వేడి రోజురోజుకి పెరిగి పోవడంతో ఈ ఇష్యూ ఏదో విధంగా సెటిల్ చేయాలని అల్లుఅరవింద్ ఒక నిర్ణయం తీసుకుని నాగబాబు హెల్ప్ అడిగి నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవి షష్టిపూర్తి వేడుకలలో మితిమీరిన విధంగా గొడవ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓపెన్ గా తిట్టి కంట్రోల్ చేసిన నాగబాబుకు మళ్ళీ ఈ విషయమై పగ్గాలు అప్పజెప్పడంతో అసలు నాగబాబు పిలుపుకు పవన్ వీరాభిమానులు స్పందిస్తారా? ఒకవేళ పవన్ అభిమానులు నాగబాబు వద్దకు వచ్చినా బన్నీని వదిలేయండి అంటూ సముదాయిస్తాడా? అనే విషయం పై రకరకాల ఊహగానాలు ఫిలింనగర్ లో హల్ చెల్ చేస్తున్నాయి.

ఏదేమైనా నాగబాబు గానీ లేదా మరే మెగా,అల్లు హీరో గానీ కాస్త చొరవ చూపించకపోతే మెగా అభిమానుల్లోనే వర్గాలూ, పార్టీలుగా విడిపోయే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X