అల్లు అరవింద్ చెప్పడం వల్లనే చిరు నాగబాబుకి అన్యాయం చేస్తున్నాడా..?
అల్లు అరవింద్, చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఒకరికోసం ఒకరు అంటూ ఎదిగారు. అల్లు అరవింద్ మీద ఉన్న మమకారంతో సోదరుడిని నిర్మాతగా కూడా ఎదగనివ్వని చిరంజీవి ఇప్పుడు బావ అల్లు అరవింద్ సలహా మీద మరోసారి తమ్ముడు నాగబాబుకి అన్యాయం చేస్తున్నాడని గుసగుసలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి. తన కొడుకు వరుణ్ తేజ్‌ని కూడా హీరోగా పరిచయం చేయాలని నాగబాబు తహాతహాలాడుతుంటే చిరంజీవి ఏదో ఒక కుంటి సాకులు చెప్పి వద్దని వారిస్తున్నాడని సమాచారం.
ఇప్పటికే తన కుటుంబం నుండి హీరోలు బాగా ఎక్కువై పోయారని, అందుకే వరుణ్ తేజ్‌ని తెలుగు సినిమాకి పరిచయం చేసే అరంగేట్రాన్ని మరికొంత కాలం ఆలస్యం చేస్తే బాగుంటుందని చిరంజీవి అన్నట్లు సమాచారం. దీనికి అంతటికి కారణం అల్లు అరవిందేనని అనుకుంటున్నారు. అల్లు అర్జున్‌కి పోటీగా రామ్ చరణ్ దిగడంతోనే అభద్రతాభావంతో ఉన్న అల్లు అరవింద్ ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్‌ని కూడా తీసుకొస్తే తన కొడుకుకి మరింత డ్యామేజి జరుగుతుందని భయంతోనే చిరంజీని చేత ఈపని చేశాడంట.
నిజానికి వరుణ్ తేజ్ ఇప్పటికే హీరో అయి ఉండాల్సింది. కానీ మూడేళ్శ కాలంగా అతని పరిచయాన్ని చిరంజీవి సాయంతో అల్లు అరవింద్ అడ్డుకుంటున్నట్లు వినికిడి. ప్రస్తతుం మోగా హీరోలుగా వెలుగోందుతున్న రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్‌ల కంటే వరుణ్ తేజ్ అందగాడు, ఆజానుబాహుడు. సామాన్యంగా హీరో అవ్వాలంటే కొంత మంది అందం కోసం సర్జరీలు చేయించుకుంటుంటారు. కానీ వరుణ్ తేజ్‌కి మాత్రం అలాంటి సర్జరీల అవసరం లేదు. దీనిని బట్టి అల్లు అర్జున్ కుటిల రాజకీయాల వల్ల నాగబాబు కుటుంబానికి అన్యాయం జరగుతుందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
గతంలో కూడా ఈవార్త చాలా సార్లు మనం చాలా సార్లు విన్నాం. అల్లు అరవింద్ వల్లే చిరంజీవి ప్రజారాజ్యం సగం నష్టపోవడానికి కారణం అయిందని, ఇది మాత్రమే కాకుండా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అల్లు అరవింద్ కూడా ఓ ముఖ్యకారకులని మనకు తెలిసిందే.


Click it and Unblock the Notifications











