విడిపోయిన 'రామలక్ష్మణులు'
చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు రాముడికి లక్ష్మణుడిగా అన్న వెన్నంటే వుండేవాడు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడలా కాదు సైడ్ అయిపోయాడు. చిరంజీవి రాజకీయ ప్రవేశానికి ముందు అన్నీ తానై ముందుండి జనంలోకి వచ్చి వారి మనోభావాలు తెలుసుకోవడం, పార్టీ ప్రకటన అనంతరం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎందుకో పార్టీకి దూరంగా వుంటున్నాడు.
వీటన్నిటి మధ్య అల్లు అరవింద్ హస్తం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ లైమ్ లైట్ లో లేని పార్టీ కోసం పనిచేస్తే వున్న పరువు పోతుందని పక్కకు తప్పుకున్నారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ పి.ఆర్.పి అల్లు అరవింద్ nagababu chiranjeevi prp allu aravind pavan kalyan


Click it and Unblock the Notifications