అరవింద సమేతలో ఎన్టీఆర్ తండ్రి అతడేనా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ఈ అంచనాలని రెట్టింపు చేసింది.
Recommended Video

తాజగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు ఇదివరకే వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా బ్రదర్ నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ చిత్రాల్లో అన్ని పాత్రలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక నాగబాబు పాత్రని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











