Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రామ్ చరణ్ ‘ఆరెంజ్’కి సంబందించి మరో ట్విస్ట్ రిలీజ్ చేసిన నాగబాబు...
ఎందుకనోగానీ 'ఆరెంజ్" సినిమా విజయంపై సందేహాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. 'మగధీర" తర్వాత వెంటనే సక్సెస్ కొట్టడం అంత తేలిక కాదని అంచనాలు వేసేవారు కొందరయితే, సినిమా బాగా రాలేదు కాబట్టే..దర్శకుడు భాస్కర్ పై చిరంజీవి సీరియస్ అయ్యారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అంతే కాదు..సినిమాలోని కొన్ని సీన్స్ ను ఆనందరంగా ఒయ్ తో మళ్లీ రీషూట్ చేయించారనే గుసగుసలు కూడా ఫిలింనగర్ లో వినిపిస్తున్నారు. వీటితోనే మెగాఫ్యాన్స్ బెంబేలెత్తుతుంటే..'ఆరెంజ్" ప్రొడ్యూసర్ మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ మెగా బాంబు పేల్చి.. మెగాభిమానులెవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
'ఆరెంజ్" సినిమా కోసం టీలీ చానల్స్ స్పెషల్ ఇంటర్వ్యూలిస్తున్న నాగబాబు'ఆరెంజ్" సినిమా కళ్యాణ్ బాబు నటించిన 'ఖుషీ" కంటే కూడా పెద్ద హిట్టవుతుందని చెబుతున్నారు. 'ఖుషీ" కంటే 'ఆరెంజ్ పెద్ద హిట్టవుతుందంటే అభిమానులంతా ఖుషీగా ఫీలవ్వాలి కానీ..ఆందోళన చెందడం దేనికనే అనుమామొస్తోంది కదూ?
'ఆరెంజ్" సినిమా 'ఖుషీ" కంటే పెద్ద హిట్ అవ్వడం ఖాయమని చెబుతున్న నాగబాబు అదే నోటితో.'ఆరెంజ్" కథను కళ్యాణ్ బాబు(తన తమ్ముడు పవన్ కల్యాణ్ ని నాగబాబు ముద్దుగా 'కళ్యాణ్ బాబు" అని పిలుచుకుంటారు) సెలెక్ట్ చేసాడని చెబుతుండడం మెగాభిమానుకు నోట్లో పచ్చివెలక్కాయ పడిన ఫీలింగ్ నిస్తోంది. ఎందుకంటే ఇటీవలకాలంలో ఇటీవలకాలంలో పవన్ కళ్యాణ్ కు స్టోరీ జడ్జిమెంట్ అన్నది అస్సలు లేకుండా పోయింది. అందుకే 'కళ్యాణ్ బాబు ఓకే చెప్పిన కథ" అని నాగబాబు పదేపదే చెబుతుండడం మెగాపవర్ ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.