ఒకే ఫ్రేములో ఇద్దరు స్టార్లు: ‘వకీల్ సాబ్’లో మరో మెగా హీరో.. పవన్ కల్యాణ్ కోరిక మేరకే ఇలా.!

By Manoj Kumar P

కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ న్యూస్ ఒకటి. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన.. మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతుండడంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటుండడమూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు పండుగ చేసుకునే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

 వాళ్ల వల్ల కాని దానిని ఈయన చేసి చూపించాడు

వాళ్ల వల్ల కాని దానిని ఈయన చేసి చూపించాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆయనను తిరిగి సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ, ఎవరికీ అది సాధ్యం కాలేదు. అయితే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం పవర్ స్టార్‌తో రీఎంట్రీ చేయించుతున్నారు.

ధైర్యం చేసిన పవన్.. అక్కడలా ఇక్కడ అవుతుందా

ధైర్యం చేసిన పవన్.. అక్కడలా ఇక్కడ అవుతుందా

స్టార్ హీరో రీఎంట్రీ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి పక్కా కమర్షియల్ మూవీ కావాలి. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా అందరికీ తెలిసిన కథతోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి ‘వకీల్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో అయినట్లే ఇక్కడ కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

ఆ విషయంలో రికార్డు బద్దలు కొట్టేసిన పవర్ స్టార్

ఆ విషయంలో రికార్డు బద్దలు కొట్టేసిన పవర్ స్టార్

సినిమాలకు గ్యాప్ వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దానిని దృష్టిలో ఉంచుకునే నిర్మాత దిల్ రాజు ఆయనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, షూటింగ్ కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ప్రత్యేక విమాన సదుపాయం కూడా ఏర్పాటు చేశాడు. ఫలితంగా పవన్ ఇలా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.

గంటల్లో కోట్లు.. పవన్ కల్యాణ్ క్రేజ్‌కు నిదర్శనం

గంటల్లో కోట్లు.. పవన్ కల్యాణ్ క్రేజ్‌కు నిదర్శనం

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో సినిమాపై ఆసక్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘వకీల్ సాబ్' ఫస్ట్ లుక్‌తో పాటు మొదటి పాటను విడుదల చేశారు. ఈ రెండింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కేవలం కొన్ని గంటల్లోనే వీటిని కోట్ల మంది వీక్షించారు. పవన్ క్రేజ్‌కు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

‘వకీల్ సాబ్'లో మరో మెగా హీరో.. ఒకే ఫ్రేములో ఇద్దరు

‘వకీల్ సాబ్'లో మరో మెగా హీరో.. ఒకే ఫ్రేములో ఇద్దరు

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్' మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం... ఇందులో ఒకప్పటి హీరో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర చేస్తున్నాడట. అత్యంత ముఖ్యమైన ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు, పవన్.. నాగబాబు కాంబినేషన్‌లో సైతం కొన్ని సీన్స్ ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
పవన్ కల్యాణ్ కోరిక మేరకే ఇలా ఫిక్స్ అయ్యారు.!

పవన్ కల్యాణ్ కోరిక మేరకే ఇలా ఫిక్స్ అయ్యారు.!

‘వకీల్ సాబ్' మూవీలో నాగబాబును తీసుకోవాలని చిత్ర యూనిట్ మొదట భావించలేదని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఎంతో మంది ఆర్టిస్టులను అనుకుంటున్న విషయం పవన్‌కు తెలియడంతో... ఆయనే స్వయంగా నాగబాబు పేరును రికమెండ్ చేశారని సమాచారం. పవర్ స్టార్ కోరిక మేరకు చిత్ర యూనిట్ ఆయనతో సంప్రదింపులు జరిపి ఒప్పించిందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X