మెగా, పవర్ స్టార్ల మధ్య రాజీకి నాగబాబు ప్రయత్నాలు
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో అన్నయ్య చిరంజీవికి తోడు నీడగా ఉంటూ తన దూకుడు తనంతో పీఆర్పీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మెగాస్టార్ కు అంటిముట్టనట్టే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గ్యాప్ బాగా పెరిగి ఇద్దరి మధ్య మాటలు లేవని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇప్పడు ఈ ఇద్దరి మధ్య రాజీకుదర్చేందుకు మెగా సోదరుడు నాగబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది.
మెగాస్టార్-పవర్ స్టార్ మధ్య మనస్ఫర్థలు రావడానికి కారణం ఏమిటంటే....చిరంజీవి నీలకడ లేనితనం, ప్రజారాజ్యం పార్టీని సరిగా నడపక పోగా, అల్లు అరవింద్ జోక్యం కారణంగా పార్టీలో అనేక సమస్యలు ఏర్పడినా బావమరిదిని మందలించక పోవడం, చివరకు పార్టీ నాయకులే సహనం నశించి తమంతట తాముగా బయటకు వెళ్లియేలా చిరంజీవి ప్రవర్తన ఉండటం. కుటుంబ విషయాలను సరిగా పట్టించుకోక పోవడం. ఒకప్పుడు కాంగ్రెస్ ను బండ బూతులు తిట్టి...ఇప్పుడు సిగ్గు విడిచి అదే పార్టీలో విలీనం కావడం లాంటి పరిణామాలు.....నిక్కచ్చిగా ఉండే పవన్ కళ్యాణ్ కు అస్సలు నచ్చలేదు. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ చిరంజీవికి దూరంగా ఉంటున్నారు.
చిరు-పవన్ మధ్య విబేధాల గురించి ఇప్పటికే మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వీళ్లని కలపక పోతే మెగా పరువు రోడ్డెక్కే ప్రమాదం ఉన్నందున నాగబాబు స్వయంగా చొరవ తీసుకుని వీళ్లని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











