For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి సినిమాతో బాలీవుడ్‌లోకి నాగబాబు: విలన్‌గా నటించనున్న మెగా బ్రదర్.. కొత్త లుక్ సీక్రెట్ అదే!

  |

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీ రంగంలోకి ప్రవేశించారు కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆయన.. ఆ తర్వాత హీరోగానూ మారారు. అంతేకాదు, నిర్మాతగా, సహాయ నటుడిగా ఎన్నో విధాలుగా మెప్పించారు. ఇలా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను అలరించిన మెగా బ్రదర్.. చాలా కాలంగా బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అది కూడా ఓ హిట్ మూవీ రీమేక్‌తో అని టాక్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  మెరుపు తీగలా మారిన షాలిని పాండే.. వయ్యారాలు ఒలకబోస్తున్న అర్జున్ రెడ్డి భామ

  అన్నయ్య సినిమాతో పరిచయం.. ఎన్నో చిత్రాలు

  అన్నయ్య సినిమాతో పరిచయం.. ఎన్నో చిత్రాలు

  తాను నటించిన ‘రాక్షసుడు' అనే సినిమాతో నాగబాబును చిత్ర సీమకు పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఎన్నో రకాలుగా కొనసాగింది. యాక్టింగ్ పరంగానే కాదు.. నిర్మాణ రంగంలోనూ ఆయన సత్తా చాటారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలను నిర్మించారు. అలాగే, ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలతో మెప్పించారు.

  సీరియల్ హీరోగా ఎంట్రీ.. జబర్ధస్త్‌గా మారిన కెరీర్

  సీరియల్ హీరోగా ఎంట్రీ.. జబర్ధస్త్‌గా మారిన కెరీర్


  చిత్ర సీమలో తనదైన మార్కుతో దూసుకెళ్లిన నాగబాబు.. బుల్లితెరపై కొన్ని సీరియళ్లలోనూ నటించి మెప్పించారు. అదే సమయంలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన జబర్ధస్త్‌ షో ద్వారా జడ్జ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడేళ్లు పాటు అందులో తనదైన శైలి మేనరిజంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా స్మైలింగ్ స్టార్, టవర్ స్టార్ అనే పేర్లు సంపాదించుకుని మరింత పాపులర్ అయ్యారు.

  దానికి గుడ్‌బై.. అదిరింది అంటూ వచ్చిన బ్రదర్

  దానికి గుడ్‌బై.. అదిరింది అంటూ వచ్చిన బ్రదర్


  చాలా ఏళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు.. కొద్ది రోజుల క్రితం ఆ షోకు గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు. జబర్ధస్త్‌ షోకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్ దీనిని రూపొందించారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ప్రస్తుతానికి ప్రసారం అవడం లేదు.

  కొత్త టాలెంట్‌ కోసం ఓ షో... సక్సెస్‌ఫుల్‌గా జర్నీ

  కొత్త టాలెంట్‌ కోసం ఓ షో... సక్సెస్‌ఫుల్‌గా జర్నీ


  జబర్ధస్త్ షోలో పని చేసినప్పుడే ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగబాబు. అదిరిందిలోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా కొన్ని షోలను ప్రారంభించబోతున్నట్లు ఆ మధ్య యూట్యూబ్ చానెల్ ద్వారా తెలిపారు.

  అందులో ఫుల్ బిజీ.. కొత్త లుక్‌తో షాకిచ్చాడుగా

  అందులో ఫుల్ బిజీ.. కొత్త లుక్‌తో షాకిచ్చాడుగా


  నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ పోస్టులు పెడుతుంటారు. ఇక, ఇటీవలే ఓ వైల్డ్ లుక్‌తో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు షాకిచ్చారాయన.

  ఆ మూవీ రీమేక్‌‌తో బాలీవుడ్‌లోకి మెగా బ్రదర్

  ఆ మూవీ రీమేక్‌‌తో బాలీవుడ్‌లోకి మెగా బ్రదర్


  గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో నాగబాబు సినిమాల వేగం బాగా తగ్గించారు. అడపాదడపా కొన్ని చిత్రాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన నేరుగా బాలీవుడ్‌లోకే అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అది కూడా ఓ హిట్ మూవీ రీమేక్ ద్వారా. అదేనండీ.. తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ‘ఛత్రపతి' రీమేక్‌తో ఆయన హిందీలోకి వెళ్తున్నారట.

  Singer Sunitha Wedding ఆదర్శప్రాయం అంటున్న Naga Babu !
  ఆ సినిమాలో విలన్‌గా నటించనున్న నాగబాబు

  ఆ సినిమాలో విలన్‌గా నటించనున్న నాగబాబు


  ‘ఛత్రపతి' హిందీ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో నాగబాబు మెయిన్ విలన్‌గా నటిస్తున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ పాత్రను ఎంతో క్రూరంగా చూపించబోతున్నారని అటు బీ టౌన్‌లోనూ ఇటు ఫిలిం నగర్‌లోనూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల వచ్చిన కొత్త లుక్ సీక్రెట్ ఇదేనని టాక్.

  English summary
  Konidela Nagendra "Naga" Babu is an Indian actor and producer associated with the Telugu film industry. He acts mainly in supporting roles and villain roles, though he has also played the lead role in some films. He has acted in 143, Anji, Shock, Sri Ramadasu, Chandamama and Orange.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X