Varun Tej-Lavanya Marriage : నిహారిక పెళ్లిలో చేసిన తప్పు రిపీట్ కావొద్దు.. నాగబాబు సంచలన నిర్ణయం

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఫ్యామిలీలో నిహారిక విడాకులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె పెళ్లి విషయంలో జరిగిన తప్పు... వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయంలో జరగొద్దని నాగాబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అసలు ఆ నిర్ణయం ఏంటి.. ఏం తీసుకున్నాడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వీరు ప్రేమలో ఉన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా టైంలోనే వీరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇక కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ గా లవ్ చేసుకున్న ఈ జంట ఇటీవల ఎంగేజ్మెంట్ తో ఒక్కటయ్యారు. ఇక ఇరు కుటుంబాలు వీరి పెళ్లిని ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు.

Nagababus sensational decision for VarunTej Marriage not to repeat the mistake made in Niharikas wedding

ఇక ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ పెళ్లి కోసం ఇప్పటికే దాదాపు మెగా హీరోలందరూ కూడా తమ షూటింగ్లకు వారం పాటు సెలవు పెట్టారని ఇన్ సైడ్ టాక్. నవంబర్ ఒకటిన వీరి పెళ్లి జరగనుందని టాలీవుడ్ వర్గాల సమచారం.

అయితే ఇదిలా ఉంటే... వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. నిహారిక పెళ్లి విషయంలో జరిగిన తప్పు.. ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో జరగవద్దని సూచించారట. ఎంత హ్యాపీగా ఉన్నా.. నాగాబాబు నిహారిక మ్యారేజ్ క్యాన్సిల్ కావడంపై కాస్త బాధగానే ఉన్నారట. అయితే కొడుకు విషయంలో కూడా అలాంటి తప్పు జరగకూడదని అన్ని పద్ధతులు పాటిస్తున్నారని తెలుస్తోంది.

Nagababus sensational decision for VarunTej Marriage not to repeat the mistake made in Niharikas wedding

నిహారిక, జోన్నలగడ్డ చైతన్య వివాహం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఫోటో షూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల.. పెళ్లి ముహూర్తానికి జరగలేదట. అనుకున్న ముహూ్ర్తానికి పెళ్లి జరగకపోవడం వల్లే... నిహారిక పెళ్లి జీవితంలో సమస్యలు వచ్చాయట. అందుకే వారు విడిపోయారు అని.. అప్పట్లో ఓ వార్త కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు అందుకే నాగాబాబు.. వరుణ్ తేజ్ విషయంలో చాలా ముందు జాగ్రత్తగా వ్యహారిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే లావణ్య, వరుణ్ తేజ్ ప్రీవెడ్డింగ్ షూట్ కూడా పూర్తయిందంట. ఇక పెళ్లి సమయంలో ఫోటోలు దిగాలి అనుకుంటే.. పెళ్లి అనుకున్న టైంకు అయిన తర్వాతే అని కండీషన్ పెట్టారని తెలుస్తోంది. అయితే కొడుకు జీవితం కోసం ఇలా నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్స్ అభినందిస్తున్నారు. మంచి విషయమే కదా అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి వచ్చే నెలలో వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఎలా జరగనుందో చూడాలి మరి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X