వంగవీటి మోహన్ రంగా గా నాగచైతన్య?
నాగచైతన్య 'బెజవాడ రౌడీలు'చిత్రంలో చేసే పాత్ర వంగవీటి మోహన్ రంగా ది అని విశ్వసనీయంగా తెలుస్తోంది.అలాగే దేవినేని రమణ అలియాస్ గాంధీ పాత్రని అభిమన్యుసింగ్ చేస్తున్నాడు.రామ్ గోపాల్ వర్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం బెజవాడ లో జరిగిన సంఘటనలు నేపధ్యంలో జరిగే కథ అని చెప్తున్నారు.అయితే వర్మకానీ, నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ గానీ ఈ విషయం ఒప్పుకోవటం లేదు.పోలీసుల ప్రొటక్షన్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ప్రతీక రావు('అతిథి' ఫేం అమృతారావు చెల్లెలు)నటిస్తోంది.నూతన దర్శకుడు వివేక్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలనేది నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











