నాగచైతన్య ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లే
నాగచైతన్య దడ ప్లాప్ అయిన దగ్గరనుండి ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలనే తపనతో తీసుకునే నిర్ణయాలు అందరిని దూరం చేసేటట్లు ఉన్నాయి. తాజాగా అతను ప్రస్దానం దర్శకుడు దేవకట్టాను పిలిచి ఆటోనగర్ సూర్య చిత్రం చేయటం కష్టమని చెప్పి, వేరే సబ్జెక్టుతో వస్తే ఆ డేట్స్ తో ముందుకు వెళ్ధామని చెప్పటం జరిగిందిట. దాంతో దర్సకుడు దేవకట్టా చాలా కాలం నుండి ఆటో నగర్ సూర్య స్క్రిప్టుపై ఉన్నాం..ఇప్పుడు డ్రాప్ అయ్యి వేరే కథ అంటే కష్టమని చెప్పాడట. అంతేగాక నాగచైతన్య ఇప్పుడు తాను రామ్ గోపాల్ వర్మకు చేస్తున్న బెజవాడకూ, ఆటో నగర్ సూర్య కు బ్యాక్ డ్రాప్ నుంచి క్యారెక్టర్ దాకా పోలికలు ఉన్నాయి కాబట్టి మీకే నష్టం..అయినా యాక్షన్ సినిమాలు ప్రూవ్ అయ్యాక చేయటం బెస్ట్ తేల్చి చెప్పాడట. నాగార్జున కూడా కొంచెం అటూ ఇటూగా అదే మాటలు చెప్పటంతో దేవకట్టా బాగా నీరసపడ్డాడని అంటున్నారు. ఈ నేపద్యంలో దర్సకుడు దేవకట్టా తన ట్విట్టర్ లో ఇస్తున్న ట్వీట్స్ చర్చనీయాంసమయ్యాయి. ఆయన తాజాగా ...మీరు ఎవరి వెనకాల అయినా ఎక్కువ కాలం పడితే చివరకు లూసర్ గా మిగులుతాడు అని ట్వీట్ చేయటం కూడా అందరిలో ఆసక్తిని రేపింది.


Click it and Unblock the Notifications











