నాగచైతన్య తెరంగ్రేటం త్వరలోనే?
ఒకప్పుడు కొత్త హీరోల లాంచింగ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ద్వారా జరిగేది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీలో ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్. చిరుత చిత్రంతో చిరంజీవి కుమారడు రామ్ చరణ్ ని సేఫ్ గా లాంచ్ చేయటంతో ఆయనకు డిమాండు మరీ పెరిగింది. తాజాగా పూరీ నాగార్జున కుమారుడు నాగ చైతన్య తెరంగ్రేటం కు సంభందించిన యేర్పాట్లు చేస్తున్నాడు . దాని నిమిత్తం గత కొంత కాలంగా నాగ చైతన్య డైలాగ్ డెలవరి, నటన, ఫైట్స్,నృత్యాలకు సంభందించిన ట్రైనింగ్ లో తీసుకుంటున్నాడు. పూరీ సలహా సూచనల మేరకే ఆ ఏర్పాట్లు జరిగుతున్నాయి. మరో ప్రక్క యాక్షన్ కలగలిపిన లవ్ స్టోరి లైను నాగార్జున కి చెప్పటం జరిగిందిట. కాని ఆయన మరోటి మార్చమన్నాడట. దాంతో పూరి ఒక స్టోరి డిపార్ట్ మెంట్ నే యేర్పాటు చేసి కథ వండుతున్నాడుట. అంతే గాక పూరీ ఈ మథ్యనే నాగ చైతన్య తో ఫొటొ సెషన్ కూడా విజయవంతంగా పూర్తి చేసాడుట. రవితేజ 'నేనింతే' పూర్తవగానే ఈ ప్రాజెక్టు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. బెస్టాఫ్ లక్ నాగ్ చైతన్య!


Click it and Unblock the Notifications











